Moviesనమ్రత ఆ విషయంలో ఒక్కటే ఎందుకు ఇలా చేస్తుంది..? మహేష్ బాబు...

నమ్రత ఆ విషయంలో ఒక్కటే ఎందుకు ఇలా చేస్తుంది..? మహేష్ బాబు ఫ్యాన్స్ కి మండిపోతుందిగా..!!

మనకు తెలిసిందే.. నమ్రత ముంబై బ్యూటీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ..ఎంతోమంది కుర్రాళ్లను తన అంద చందాలతో ఊపు ఊపేసింది ..మెప్పించింది. ఇండస్ట్రీని మడత పెట్టేసింది. అయితే ఏ ముహూర్తాన మహేష్ బాబును పెళ్లి చేసుకుని తెలుగు ఇంటికి కోడలుగా వచ్చిందో అప్పటినుంచి నమ్రత పద్ధతికి మరో మారుపేరుగా మారిపోయింది. ఎక్కడ కూడా తన హద్దులు మీరలేదు.. భర్త అడుగుజాడల్లో నడుస్తుంది . భర్త నే ప్రపంచం అంటూ పిల్లలే తన భవిష్యత్తు అంటూ ముందుకు సాగుతుంది.

ఘట్టమనేని బిజినెస్లను దగ్గరుండి చూసుకుంటున్న నమ్రత ఇప్పుడు తన కూతురిని ఇండస్ట్రీలో హీరోయిన్గా దింపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఆఫ్ కోర్స్ స్టార్ బ్యాక్ గ్రౌండ్ ..తాత పెద్ద హీరో.. తండ్రి సూపర్ స్టార్ తల్లి ఒకప్పటి హీరో.. ఇంతకన్నా పెద్ద బ్యాగ్రౌండ్ అవసరమా..? సితార హీరోయిన్గా ఎంట్రీ కి ముహూర్తం కూడా ఖరారు అయిపోయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . పవన్ కళ్యాణ్ కొడుకు అకిరానందన్ తో సినిమా ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ కూడా ప్రచారం జరుగుతుంది . అయితే అంతకన్నా ముందే నమ్రత కూతురు భవిష్యత్తు విషయంలో చాలా కేర్ఫుల్గా స్టెప్స్ వేసేస్తుంది అంటున్నారు జనాలు . కానీ ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఘట్టమనేని ఫ్యాన్స్ కి నచ్చడం లేదు . చిన్న ఏజ్ లోనే మహేష్ బాబు కూతురు సీతార సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇప్పించడం.. ఆమె కంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేయడం మీడియాతో.. ముచ్చటించేలా చేయడం మీడియాలో ఆమె పేరుని హైలెట్ చేయడం అభిమానులకు నచ్చడం లేదు .

హీరోయిన్ అయ్యాక మీడియాతో ముచ్చటించడం వేరు హీరోయిన్ కాకముందు మీడియా ముందు కూర్చోవడం వేరు. ఒకానొక యాడ్లో నటించినందుకుగాను సితార ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంది అంటూ ప్రచారం జరిగింది . అంతేకాదు మీడియా ఈవెంట్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో కూడా తెలిసిందే. చిన్న ఏజ్ లోనే ఆమెను అలాంటి స్ట్రెస్ కి గురి చేయడం అవసరమా ..?అంటున్నారు ఫాన్స్ .

ఆమె ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా రావడానికి ఇంకా టైం పడుతుంది ..మరి ఎందుకు అప్పుడే ఆమెకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేయడానికి చూస్తుంది.. నమ్రత అంటున్నారు అభిమానులు . ఈ విషయంలో టోటల్ కర్త – కర్మ – క్రియ అంతా కూడా నమ్రతానే అని మహేష్ బాబు సైలెంట్ గా ఉండిపోయాడు అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news