Moviesపుష్ప2తో రానాకి ఉన్న సంబంధం ఏమిటి? ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసిన సుకుమార్...

పుష్ప2తో రానాకి ఉన్న సంబంధం ఏమిటి? ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసిన సుకుమార్ షాకింగ్ ట్వీస్ట్..!

ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో .. ఆ మాటకు వస్తే పాన్ ఇండియా లెవెల్ లో ఎక్కడ చూసిన సరే పుష్ప2 సినిమాకి సంబంధించిన పోస్టర్స్ పాటలు ఆయనకు సంబంధించిన మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా రీసెంట్గా రిలీజ్ అయిన పుష్ప పుష్ప పుష్ప పాట కుర్రాల నర నరాల్లోకి ఎక్కేసింది . అసలు పోవడం లేదు . మెంటల్ ఎక్కించేసాడు దేవి శ్రీ ప్రసాద్ అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి . ఆ లిరిక్స్ తో చంద్రబోస్ మరో మెట్టు ఎక్కాడు అని చెప్పాలి .

పుష్పరాజ్ క్యారెక్టర్ కి సరిగ్గా సెలెక్ట్ అయిన పదాలను వాడుతూ ఓ రేంజ్ లో అల్లాడించేసాడు. ఆ లుక్స్ ఏంటిరా బాబు అసలు మైండ్లో నుంచి పోవడం లేదు అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు . కాగా రీసెంట్గా పుష్ప2 సినిమాకి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ షేడ్స్ లో కనిపించబోతున్నాడట . పుష్ప రాజ్ హీరోనే కానీ తనలోని నెగిటివ్ యాంగిల్ ని ఒకానొక మూమెంట్లో బయట పెట్టబోతున్నాడట .

అది ఎలా అంటే అచ్చంగా నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రానా దగ్గుబాటి ఏ విధంగా అయితే తనలోని మంచితనాన్ని తొక్కేయడానికి చూసిన వాళ్లకు నెగిటివ్ షేడ్స్ చూపిస్తారో అదే విధంగా పుష్ప రాజ్ క్యారెక్టర్ లో ఉన్న బన్నీ కూడా కనిపించబోతున్నాడట . కొన్ని కొన్ని సీన్స్ పుష్పరాజ్ క్యారెక్టర్ ని మార్చలేకపోతున్నారట. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు గట్టిగా వైరల్ గా మారింది . అంతేకాదు అల్లు అర్జున్ రానా దగ్గుబాటి ఎంత మంచి ఫ్రెండ్స్ అనే విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఒకే టైప్ ఆఫ్ క్యారెక్టర్ లో కనిపించబోతూ ఉండటంతో ఫ్యాన్స్ ఈ న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త సంచలనంగా మారింది. చూడాలి మరి పుష్ప రాజ్ ఏ రేంజ్ లో మెప్పిస్తాడో..???

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news