అటు ఏపీలో ..ఇటు తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎప్పుడు లేని విధంగా ఈసారి స్టార్ సెలబ్రిటీస్ తమ ఓటు హక్కును పూర్తిగా ఉపయోగించుకున్నారు . మరి ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటు వచ్చిన వాళ్ళు ఈసారి ఓటు హక్కు వినియోగించడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించారు. తెల్లవారుజాము నుంచే పోలింగ్ బూత్ వద్ద క్యూలో పడి గాపులు కాచి మరి ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం. చాలామంది స్టార్ సెలబ్రిటీస్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు .
మెగాస్టార్ చిరంజీవి – మహేష్ బాబు – ఎన్టీఆర్ – అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ ప్రభాస్ తన ఓటు హక్కును వినియోగించుకోలేదు . తెలంగాణలో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఏపీలో ఓటు ఉంది ఆ కారణంగానే ఇక్కడ ఓటు వేయలేదు అని అనుకున్నారు జనాలు . అయితే ఇప్పుడు ఏపీలోను ప్రభాస్ ఓటు వేయలేదు. దీంతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
అంతేకాదు వయసు పైబడిపోయిన వాళ్ళు కూడా ఓపికగా పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు వేశారు . కోటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు ఆరోగ్యం బాగో లేకపోయినా సరే పోలింగ్ బూత్ కి వచ్చి ఓటేశారు . కానీ ప్రభాస్ మాత్రం ఓటు వేయలేదు . దీంతో చాలా మంది ప్రభాస్ ని ట్రోల్ చేశారు . కొంతమంది బూతులు కూడా తిట్టారు. అయితే ప్రభాస్ ఓటు వేయకపోవడానికి మెయిన్ రీజన్ ఆయన ఇండియాలో లేకపోవడమే ..ఆయన ఫారిన్ కంట్రీస్ లో షూటింగ్ షెడ్యూల్స్ లో బిజీగా ఉన్నారట . ఆ కారణంగానే ప్రభాస్ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారట . ఇది తెలియక చాలామంది నోటికొచ్చిన మాటలు మాట్లాడేస్తున్నారు..!!