కోలీవుడ్ స్టార్ శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి ప్రధానోపాత్రలో నటించిన సినిమా శబరి . ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వరలక్ష్మి శరత్ కుమార్ ఎంతలా కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ప్రతి సినిమాలోని తన క్యారెక్టర్ ని వైవిధ్యంగా వరలక్ష్మి శరత్ కుమార్ చూస్ చేసుకుంటుంది. శబరి సినిమాలోను అలాంటి ఒక స్పెషల్ పాత్రను చూస్ చేసుకుంది. ఈ సినిమా నేడు థియేటర్స్ లో రిలీజ్ అయి అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి రివ్యూ ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం ..!
పలు సినిమాల ద్వారా బాగా దగ్గర అయిపోయింది వరలక్ష్మి శరత్ కుమార్ . ఆమె తాజాగా నటించిన సినిమా శబరి . మహేంద్ర నాథ్ ఈ సినిమాని నిర్మించారు అనిల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు . ఫుల్ టు ఫుల్ సస్పెన్స్ ధ్రిల్లర్ గా ఈ చిత్రం అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది . మరి ముఖ్యంగా ధ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ జనాలకు రేంజ్ లో నచ్చేసింది . సంజన (వరలక్ష్మి శరత్) కుమార్ సింగల్ మదర్.. గా తన లైఫ్ ని కొనసాగిస్తూ ఉంటుంది .
భర్త అరవింద్ (గణేష్ వెంకట్రామన్) ఆమెను వదిలేసి వెళ్ళిపోతాడు. కూతురు రియాతో ముంబై నుంచి విశాఖపట్నం వచ్చేస్తుంది సంజన . ఫ్రెండ్ వద్ద ఉంటూ జాజ్ ప్రయత్నాలు చేస్తూ వస్తుంది . కూతుర్ని బాగా చదివించాలని ఆమె కోరిక . జాబ్ కోసం చాలా చాలా కష్టపడుతుంది . ఈ క్రమంలోనే కాలేజీనాటి ఫ్రెండ్ కలుస్తాడు. అతను సహాయంతో ఒక కార్పొరేట్ కంపెనీకి జాబ్ కి వెళ్తుంది .ఆమె క్వాలిఫికేషన్ కి తగ్గ జాబ్ దొరకదు . డాన్స్ ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్ పోస్ట్ ఖాళీగా ఉందని తెలిసి రిక్వెస్ట్ చేసి మరి ఆ జాబ్ లో జాయిన్ అవుతుంది .
అయితే ఓ ఫారెస్ట్ సింగల్ గా ఉన్న ఇంట్లో షిఫ్ట్ అవుతుంది. ఆ తర్వాత ఆమె లైఫ్ ఎలా మారింది..? తన కూతురు జీవితం ఎలా తలకిందులు అయిపోతుంది..? కూతుర్ని కాపాడుకోవడానికి సంజన ఏం చేస్తుంది? ఎలాంటి రిస్క్ చేసి తన కూతురు విషయంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తుంది..? అంతేకాకుండా భారీ భారీ ట్వీస్ట్ లు కూడా పెట్టాడు డైరెక్టర్ . అయితే లాస్ట్ కి తన కూతుర్ని అరవింద్ ఏం చేశాడు..? అరవింద్ ని సంజన ఎందుకు వదిలేసింది..? సంజనాన్ని వెంబడించిన ఆ సూర్య ఎవరు..? అసలు అతనికి కూతురు రియాకి సంబంధం ఏంటి ..? అనేది అసలు కథ..!
నటన పరంగా వరలక్ష్మీ శరత్ కుమార్ చించేసింది అనే చెప్పాలి . డైరెక్టర్ కూడా తనదైన స్టైల్ లో కథను బాగానే తెరకెక్కించాడు . ఫస్ట్ ఆఫ్ అంత క్యారెక్టర్ ఇంట్రడక్షన్ లోనే వెళ్ళిపోతుంది. ఇంట్లో కొంత హారర్ ఎలిమెంట్లు చూపించడానికి ట్రై చేసాడు. భయం కూడా బాగానే వేస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం కూడా సస్పెన్స్ గా కొనసాగుతుంది . మొత్తానికి కొన్ని కొన్ని సీన్లు మాత్రం బోర్ తెప్పిస్తాయి . ఈ మధ్యకాలంలో ఇలాంటి సస్పెన్స్ మనం చాలానే చూస్తాం . కానీ ఇలాంటి సస్పెన్స్ లు ఎన్ని సార్లు చూసిన మరోసారి చూడాలి అనిపిస్తూ ఉంటుంది . మొత్తానికి ఈ సినిమాతో మంచి ఫీడ్ బ్యాక్ ని దక్కించుకునింది వరలక్ష్మి శరత్ కుమార్ . చూద్దాం మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..?