సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుంది ..? ఫట్ అవుతుంది..? అని చెప్పడం పెద్ద టఫ్ జాబ్. ఎవరు గెస్ చేయలేరు . కొంతమంది సీనియర్స్ అలాగే గెస్ చేసినా కొన్ని కొన్ని సార్లు మిస్ ఫైర్ అవుతూ ఉంటాయి . కాగా ఇండస్ట్రీలో చాలా సినిమాలు కూడా హిట్ అవుతాయి . అనుకొని లాస్ట్ మూమెంట్లో ఫ్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి . ఆ సినిమాలేంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!
ఖలేజా: త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కాన్సెప్ట్ పరంగా హైలైట్. మహేష్ బాబుని దేవుడిని చేసి చూపిస్తాడు త్రివిక్రమ్ . అనుష్క పెర్ఫార్మెన్స్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది . కామెడీ కూడా బాగానే పండించారు. బ్రహ్మానందం – ఆలీ సీన్స్ సినిమాకి హైలెట్ గా మారుతాయి . అయినా సరే ఈ సినిమా ఫ్లాప్ అయింది . దానికి కారణం కాన్సెప్ట్ జనాలకు అర్థం కాకపోవడమే. ఎప్పుడు లవ్ స్టోరీలు యాక్షన్ సినిమాలు చేసే హీరో ఒక్కసారిగా దేవుడిగా చేసి చూపించడంతో ఈ సినిమా కధ అడ్డం తిరిగింది. క్లైమాక్స్ కూడా పెద్దగా బాగోకపోవడంతో సినిమా ఫ్లాప్ అయింది..!!
వేదం: క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మంచు మనోజ్ – అల్లు అర్జున్ హీరోలుగా నటించారు . దీక్ష సేధ్ – అనుష్క శెట్టి కీలకపాత్రలో నటించి మెప్పించారు. ఒరిజినల్ కాన్సెప్ట్ తెరకెక్కించడంలో క్రిష్ తర్వాతే మరి ఎవరైనా . ఎంతో రియలిస్టిక్గా తెరక్కించిన ఈ సినిమాలో క్లైమాక్స్ అస్సలు బాగోదు. జనాలు అసలు ఎంకరేజ్ చేయలేకపోయారు . ఆ కారణంగానే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టొరీ అయినప్పటికీ సినిమా ఫ్లాప్ అయింది.
విరాటపర్వం: ప్యూర్ లవ్ స్టోరీ ..రానా దగ్గుబాటి హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటించిన ఈ సినిమా అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది అంటూ సినిమా ప్రమోషన్ టైం లో జనాలు మాట్లాడుకున్నారు . ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రానా సాయి పల్లవి ఎంత కష్టపడ్డారు అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే సినిమాలో సాయి పల్లవి క్యారెక్టర్ హైలైట్ గా మారడం రానా దగ్గుబాటి మొండితనం మరి ఎక్కువగా ఉండడం ..ప్రేమ కాన్సెప్ట్ను హైలెట్ చేయాలి అనుకున్న డైరెక్టర్ ప్రేమకు సరైన విధంగా ఈ సినిమాలో రెస్పెక్ట్ ఇవ్వకపోవడంతోనే ఈ సినిమా ఫ్లాప్ అయింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. సాయి పల్లవి క్యారెక్టర్ చనిపోవడం ఈ సినిమాకి మరింత డిజాస్టర్ గా మారింది.
అంటే సుందరానికి : నాని హీరోగా – నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంటుంది అంటూ ఎక్స్పెక్ట్ చేశారు . ప్రమోషన్ టైం లో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడం హైలైట్ గా మారింది . ఈ కాన్సెప్ట్ కూడా చాలా కొత్తది.. డిఫరెంట్ గా ఉంటుంది . అయితే కొన్ని కొన్ని సీన్స్ ఈ సినిమాలో జనాలకి కన్ఫ్యూషన్ గా అనిపిస్తాయి . అసలు నాని ఎందుకు అలా చేశాడు..? నజ్రియా నజీమ్ ఎందుకు నానిని ఇబ్బంది పెడుతుంది ..? ప్రేమంటే ఇదేనా..? పెళ్లి తర్వాత ఇలా ఉంటుందా..? అనే విషయాలు ఇప్పటికి కన్ఫ్యూషన్ గానే ఉండిపోయాయి.. ఆ కారణంగానే ఈ సినిమా ప్లాప్ అయింది . స్టోరీ బాగా రాసుకున్నప్పటికీ ఆ స్టోరీని జనాలకు చెప్పడంలో విఫలమైన కారణంగానే సినిమాలు ఫ్లాప్ అయ్యాయి..!