టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన సినిమాలు ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో ఆకట్టుకుంటూ ఉంటాయి . మరి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ నటన అంటే అభిమానులకి చాలా చాలా ఇష్టం. రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది . జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా లో నటిస్తున్న విషయం తెలిసిందే .
ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . ఈ సినిమాకి సంబంధించిన ఒక్క అప్డేట్ రిలీజ్ అయినా సరే ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఊహించుకుంటూ ఉంటారు . అంతేకాదు ఈ సినిమాకి సంబంధించిన రీసెంట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దేవర సినిమాకు ముందుగా కొరటాల శివ “నాయర్” అనే టైటిల్ ని పెట్టాలి అని అనుకున్నారట .
కానీ ఈ టైటిల్ అంతగా రీచ్ అవ్వదు అంటూ భావించిన ఎన్టీఆర్ మరో కొత్త టైటిల్ పెడదాము అంటూ ఆలోచన చేశారట . ఫైనల్లీ కొన్ని పేర్లు అనుకుంటున్నా మూమెంట్లో లక్ష్మీ ప్రణతి ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ని ఓకే చేసిందట. దేవర కూడా బాగా సెట్ అవుతుంది అంటూ కొరటాల ఫైనల్లీ దేవర అనే టైటిల్ ని ఓకే చేశారట. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వార్ 2 సినిమాని కూడా సెట్స్ పైకి తీసుకొచ్చాడు . ప్రెసెంట్ జూనియర్ ఎన్టీఆర్ ముంబైలోనే ఉన్నాడు వార్ 2 సినిమా సెట్స్ లో పాల్గొంటున్నాడు..!!