సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అయితే అలా వైరల్ అవుతున్న వార్తల్లో ఏది నిజం..? ఏది అబద్దం ..? అని చెప్పడం పెద్ద గగనంగా మారిపోయింది. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో అయితే ఏది నిజం..? ఏది అబద్దం..? అని తెలుసుకోలేకపోతున్నాం. రీసెంట్గా హీరోయిన్ కృతిశెట్టికి సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది .
కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ అయినప్పటికీ తెలుగు ఇండస్ట్రీ ద్వారా బాగా పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకుంది కృతి శెట్టి . బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఆకట్టుకునింది. అయితే కృతిశెట్టి ప్రజెంట్ కోలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా మారిపోయింది.
రీసెంట్గా ఈమెకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . కృతి శెట్టికి ఎంగేజ్మెంట్ అయిపోయిందట . చిన్నతనంలోనే తన బావను ఆమెకు ఇచ్చి పెళ్లి చేయాలి అంటూ కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారట . తాజాగా కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్గా కృతి శెట్టి ఎంగేజ్మెంట్ జరిగిపోయింది అన్న వార్త నెట్టింట బాగా వైరల్ గా మారింది . ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనేది తెలియనప్పటికీ కృతి శెట్టి కి సంబంధించిన న్యూస్ కావడంతో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది..!!