సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాలో నటించేటప్పుడు హీరో హీరోయిన్ దగ్గర అవ్వడం.. వాళ్ళ మాటలు కలవడం.. ఫ్రెండ్షిప్ కుదరడం .. ఆ తర్వాత ఫ్రెండ్షిప్ కొన్నిసార్లు ప్రేమగా మారి హద్దులు మీరుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి మనం చాలా చూసాం . అలా హద్దులు మీరీన తర్వాత పెళ్లి చేసుకుని భార్యాభర్తలు గా మారిన జంటలు కూడా మన ఇండస్ట్రీలో ఉన్నారు . కాగా సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే మాత్రం అది కచ్చితంగా విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా లవ్ మేటర్ అనే చెప్పాలి .
సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వీళ్ళిద్దరికీ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్ . అయితే వీళ్ళు ప్రేమించుకుంటున్నారు అని పెళ్లి చేసుకోబోతున్నారు అని రకరకాలుగా వార్తలు వినిపిస్తూ ఉన్న అదేం లేదు అంటూ కొట్టి పడేస్తూ ఉంటారు ఈ జంట. కానీ ఎప్పటికప్పుడు వాళ్ళ మధ్య ప్రేమాయణం ఉంది అని చెప్పే విధంగా కొన్ని పోస్ట్లు చేస్తూ ఉంటారు . తాజాగా విజయ్ దేవరకొండ తన 35వ పుట్టినరోజును బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఎప్పుడూ విజయ్ కి మొదటిగా విష్ చేసే రష్మిక ఈసారి పుట్టినరోజుకి విష్ చేయలేదు .
దీంతో అభిమానులకి కొత్త డౌట్లు వచ్చాయి . ఈ మధ్యకాలంలో రష్మిక – విజయ్ దేవరకొండకు మించిన రేంజ్ లో దూసుకుపోతూ హిట్స్ అందుకుంటూ హై రెమ్యూనరేషన్ తీసుకుంటుంది . బహుశా రష్మిక రేంజ్ పెరిగిపోవడంతో వీళ్లిద్దరి మధ్య దూరం పెరిగి లవ్ బ్రేకప్ అయినట్లు ఉంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . అందుకే రష్మిక విజయ్ కి విష్ చేయలేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు .
అయితే సోషల్ మీడియాలో రాద్ధాంతాలు భరించలేక రష్మిక విజయ్ కి విష్ చేయలేదు అని .. కానీ పర్సనల్ టీం లో మాత్రం రష్మిక విజయ్ కు విష్ చేసింది అని ..రష్మిక – విజయ్ అభిమానులు చెప్పుకొస్తున్నారు . సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్త బాగా వైరల్ గా మారింది . కొంతమంది వాళ్ళు విడిపోతే మీ కళ్ళు చల్లబడతాయా..? ఇకనైనా ట్రోలర్స్ ట్రోలింగ్ ఆపండి అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!!