టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది సుమ . తనదైన వాక్చాతుర్యంతో గలగల మాట్లాడుతూ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పటికీ ఏదైనా ఈవెంట్స్ చేయాలి అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే సినీ ప్రముఖులు సుమ ఇంటికి ముందు వెళ్తారు . అలాంటి ఓ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది . అయితే మేల్ యాంకర్స్ మన ఇండస్ట్రీలో చాలా తక్కువ . ఇద్దరూ ముగ్గురు అని చెప్పాలి . వాళ్ళల్లో టాప్ పొజిషన్లో ఉంది మాత్రం ప్రదీప్ – యాంకర్ రవి అనే చెప్పాలి .
ఇద్దరికి ఇద్దరే ఎలాంటి షో ని అయిన హోస్ట్ చేయగలరు . పరిస్థితిని హ్యాండిల్ చేయగలరు . తమదైన స్టైల్ లో హోస్టింగ్ చేసి మెప్పించగలరు. తాజాగా యాంకర్ రవి రీతూ దీతు చౌదరి హోస్ట్ చేస్తున్న దావత్ షో కి గెస్ట్ గా వచ్చాడు . ఈ క్రమంలోనే తన లైఫ్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను బయట పెట్టాడు . తన లైఫ్ లో జరిగిన వివాదాలను కూడా బయట పెట్టాడు. కాగా యాంకర్ రవి మాట్లాడుతూ తాను యాంకర్ గా మారడానికి కారణం ఒక బడా హీరో అంటూ బయట పెట్టారు .
ఆయన మాట్లాడుతూ ..”చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చిరంజీవిలా అయిపోదామని ఇండస్ట్రీకి వచ్చాను . మొదట కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశాను.. సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ కి ప్రైవేట్ పార్టీలకు లేడీ పార్టీలకు వెళ్లి డాన్స్ నేర్పించేవాడిని.. డాన్స్ చేసేవాడిని ..అలా అమలా గారు పరిచయమయ్యారు . ఆ తర్వాత నాగార్జున గారితో మీటింగ్ కుదిరింది. అప్పుడే ఆయనకి నేను హీరో అవ్వాలి అని చెప్పాను .. ఆయన నా ఎనర్జీ చూసి ఒక మ్యూజిక్ ఛానల్ లో సంథింగ్ ప్రోగ్రాం అని షో కి యాంకర్ గా సెలెక్ట్ చేశారు. అక్కడ నుంచే నా కెరియర్ టర్న్ అయింది . చిరంజీవిలా అవ్వలేము కానీ మంచి ఫామ్ ఫేమ్ రావాలి అని కోరుకున్నాను.. దానికోసం ఎంతో కష్టపడ్డాను ..అలా నాగార్జున గారు నాకు లైఫ్ ఇచ్చారు” అంటూ చెప్పుకొచ్చారు.