ఫుడ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా..? చెప్పండి . ఫుడ్ కోసమే బతికే వాళ్ళు కూడా ఉంటారు . మరీ ముఖ్యంగా ఫుడ్ లేనిదే కొంతమంది అస్సలు ఉండలేరు కదా . మన ఇండస్ట్రీలో కూడా అలాంటి హీరోలు ఉన్నారు . మరీ ముఖ్యంగా మనం ఇంట్లో అయితే ఎలా మొండి చేస్తామో ..? ఇష్టమైన ఫుడ్ ఉంటేనే ఫుడ్ అన్నం తింటాము అని ..అలా కూడా మన టాలీవుడ్ స్టార్ హీరోస్ బిహేవ్ చేస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా మన టాలీవుడ్ స్టార్ హీరోస్ కి నచ్చిన ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటి అనే విషయం ఇక్కడ చదివి తెలుసుకుందాం ..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో నాన్ వెజ్ లవర్స్ ఎక్కువగానే ఉన్నారు. చాలామంది నాన్ వెజ్ అంటే బాగా ఇష్టంగా తింటారు. కాగా అందులో మనం టాప్ పొజిషన్ లో చెప్పుకోవాల్సింది ప్రభాస్ . ప్రభాస్ మంచి ఫుడి. భోజన ప్రియుడు ..ఎక్కువగా నాన్ వెజ్ తింటూ ఉంటారు. మరి ముఖ్యంగా తనతో నటించే హీరోయిన్ కి పలు వంటకాలతో ట్రీట్ ఇవ్వడం ప్రభాస్ స్పెషాలిటీ. మరీ ముఖ్యంగా రొయ్యలు – చికెన్ బిర్యానీ అంటే ప్రభాస్ కి చాలా చాలా ఇష్టం.
ఆ తర్వాత స్థానంలో ఎన్టీఆర్ కనిపిస్తాడు . ఎన్టీఆర్ బాగా నాన్ వెజ్ తింటాడు . ఇప్పుడు తగ్గించేశాడు కానీ.. ఒక ఏజ్ లో కుమ్మి పడేసేవారు . మటన్ బిర్యానీ ..చేపల పులుసు అంటే ఎంతో ఎంతో ఇష్టం అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు . మహేష్ బాబు కూడా మంచి ఫుడీ.. కానీ డైటింగ్ పేరుతో కంట్రోల్ లో ఉంటాడు. చీటింగ్ డే నాడు మాత్రం తనకి ఇష్టమైన ఫుడ్ మొత్తం లాగించేస్తారు .
హైదరాబాద్ బిర్యానీ అంటే మహా మహా ఇష్టం అట మహేష్ బాబుకి . అల్లు అర్జున్ ఫిట్నెస్ కోసం ఇప్పుడు నోరుని కంట్రోల్ లో పెట్టుకున్నారు కానీ కెరియర్ బిగినింగ్ లో అయితే మాత్రం ఓ రేంజ్ లో కుమ్మి పడేసేవాడు . మరీ ముఖ్యంగా బిర్యానీ అంటే అల్లు అర్జున్ కి బాగా ఇష్టమట . బాలకృష్ణ కూడా మంచి భోజన ప్రియుడే . చికెన్ బిర్యాని రొయ్యల వేపుడు అంటే బాగా ఇష్టంగా తింటారట . మెగాస్టార్ చిరంజీవి ఫుడ్ ఎక్కువగా ఇష్టపడతారట. వాళ్ళ అమ్మ చేతితో వండిన ఫుడ్ ఏదైనా ఇష్టమట .అయితే చేపలు – రొయ్యలు – పీతలు అంటే మాత్రం మహా మహా ఇష్టమట..!!