జాన్వి కపూర్.. ని తెలుగు డైరెక్టర్ బలవంతం చేస్తున్నాడా..? ఇబ్బంది పెడుతున్నాడా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . కాగా రీసెంట్ గా జాన్వికపూర్ కి సంబంధించిన ఈ న్యూస్ నెట్టింట బాగా వైరల్ గా మారింది . జాన్వి కపూర్ అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు. తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది . దేవర సినిమాతో డెబ్యూ ఇస్తుంది. ఈ సినిమాతో ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉంది జాన్వి కపూర్ .
కాగా ఆ వెంటనే రాంచరణ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే మూవీ లోనూ ఛాన్స్ అందుకుంది . ఇది కూడా ఆల్మోస్ట్ హిట్ అయ్యే సినిమానే. ఇలా మంచి మంచి సినిమాలతో దూసుకుపోతున్న జాన్వి కపూర్ ని ఐటెం సాంగ్ లో చూపించాలి అంటూ తెలుగు డైరెక్టర్ ఆశపడుతున్నారట . ఆయన మరెవరో కాదు సుకుమార్. ఇండస్ట్రీలో సుకుమార్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే.
పుష్ప2 సినిమాలో జాన్వి చేత ఐటెం సాంగ్ చేయించాలి అంటూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట సుకుమార్ . అయితే బోనీకపూర్ మాత్రం ఏం మాత్రం కూడా అందుకు ఛాన్స్ ఇవ్వడం లేదట . కూతురు కెరియర్ ఫుల్ జడ్ స్పీడ్ లో దూసుకుపోతున్న మూమెంట్లో ఇలా ఐటమ్ సాంగ్ కి ఓకే చేస్తే తన కెరీర్ ఢమాల్ అంటూ పడిపోతుంది అంటూ భయపడిపోతున్నారట. అంతేకాదు సుకుమార్ ఎన్నిసార్లు అడిగినా బోనీకపూర్ ఒప్పుకోవడం లేదట . ఒకానొక టైం లో స్ట్రైట్ వార్నింగ్ కూడా ఇచ్చేసాడట. బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది . కానీ సుకుమార్ దర్శకత్వంలో ఐటెం సాంగ్ అంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది .. ఒక్కసారి ట్రై చెయ్యి అంటూ సజెస్ట్ చేస్తూ ఉండటం గమనార్హం..!!