ఇప్పుడు ఎక్కడ చూసినా సరే శ్రేయ ఘోషల్ పాడిన సూసేటి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామి అనే పాట మారుమ్రోగిపోతుంది. చాలా సైలెంట్ గా చాలా కూల్ గా ..చాలా మెలోడియస్ గా సాగిపోయే ఈ పాట ఇప్పుడు దేశాన్ని ఓ రేంజ్ లో అల్లాడించేస్తుంది. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న పుష్ప2 సినిమాలోని పాటే ఈ సూసేటి అగ్గి రవ్వ మాదిరి సాంగ్. అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న పుష్ప2 సినిమా నుంచి తాజాగా రెండో పాటను రిలీజ్ చేశారు చిత్ర బృందం .
ఈ పాట ఇప్పుడు హైలెట్గా మారిపోయింది. ఎవరి మొబైల్ ఫోన్స్ లో విన్న.. ఎవరి కాలర్ ట్యూన్స్ విన్న ..ఈపాటే వినిపిస్తుంది . కాగ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాడు దేవి శ్రీ ప్రసాద్ . అంతేకాదు ఈ పాటను తన గాత్రంతో అద్భుతంగా పాడింది శ్రేయ ఘోషల్ . పాట లిరిక్స్ ఎంత హైలెట్ గా మారాయో ఆ లిరిక్స్ కి ఆ గొంతు శ్రేయ ఘోషల్ పాడి మరింత హైలెట్గా నిలిచింది .
అయితే ఈ పాటలోని ప్రతి లిరిక్ పుష్పరాజ్ గాడి కటౌట్ కి అద్దిరిపోయే విధంగా మ్యాచ్ చేస్తూ రాశారు. కొరియోగ్రఫీ కూడా అద్దిరిపోయే రేంజ్ లో చేశారు . మ్యూజిక్ బీట్ ..బ్యాగ్రౌండ్ అంతా కూడా ఓకే .. అయితే ఎక్కడ కూడా ఒరిజినల్ కాస్ట్యూమ్స్ వేసుకున్న పిక్చర్స్ ని షేర్ చేయలేదు సుకుమార్ . సాధారణంగా ఇలాంటి వీడియోస్ కచ్చితంగా ఒకటో రెండో ఒరిజినల్ గెటప్ వేసుకున్న వీడియోస్ షేర్ చేస్తారు .
అయితే సుకుమార్ కేవలం పాటలో లిరికల్ వీడియో కోసమే స్పెషల్గా ఒక వీడియోని షూట్ చేయడం ..ఆ వీడియోని రిలీజ్ చేయడం ఫాన్స్ కు కొత్త డౌట్లు పుట్టేలా చేస్తుంది. ఈ కాస్ట్యూమ్‌స్ విషయంలో ఎందుకు సుకుమార్ అంతా సీక్రెట్ గా దాస్తున్నాడు . అంత స్పెషాలిటీ ఏముందబ్బా..? అంటూ చర్చించుకుంటున్నారు . అంతేకాదు ఒకానొక అందుకు ఆ కాస్ట్యూమ్స్ చూపించకపోవడంఈ పాటకి కొంచెం మైనస్ అయ్యాయి అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి సుకుమార్ ఏదో మాయ చేసేలానే ఉన్నాడు..!!