శ్రీ లీల .. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు ఐరన్ లెగ్ హీరోయిన్ .. ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో అల్లాడించేసిన శ్రీ లీల ఇప్పుడు తన లైఫ్ ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని ఆలోచనలో పడింది . దానికి కారణం కూడా మనకు తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ కధ.. కంటెంట్ నమ్ముకోకుండా కేవలం హీరోల స్టార్ స్టేటస్ ని నమ్ముకొని అమ్మడు సినిమాలకు సైన్ చేసింది . ఈ క్రమంలోనే వరుసగా డిజాస్టర్ తన ఖాతాలో వేసుకుంది .
దీంతో అమ్మడికి దిమ్మ తిరిగిపోయే రేంజ్ లో షాక్ ఇచ్చారు అభిమానులు . ప్రజెంట్ తెలుగులో కొన్ని సినిమాలు చేస్తూ కోలీవుడ్లో మాత్రం బడాబడా స్టార్ సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటుంది . శ్రీ లీలా కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది. శ్రీ లీల.. చేత వాళ్ళ అమ్మగారు ఒక కండిషన్ పెట్టించుకొని మరి సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇప్పిచ్చిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.
శ్రీలీల అమ్మగారికి నాగార్జున గారు అంటే చాలా చాలా ఇష్టమట. ఫేవరెట్ హీరో అట . అయితే నాగార్జున గారితో ఎట్టి పరిస్థితుల్లోనూ స్క్రీన్ షేర్ చేసుకోకూడదు ఒకవేళ చేసుకున్న కూడా.. అది కూతురు పాత్ర కోసమో వేరే పాత్ర కోసమో మాత్రమే స్క్రీన్ షేర్ చేసుకోవాలి. హీరోయిన్ గా మాత్రం అస్సలు స్క్రీన్ షేర్ చేసుకోకూడదు అంటూ క్రేజీ కండిషన్ పెట్టిందట. ఇదే న్యూస్ ఇప్పుడు నెట్ వైరల్ గా మారింది. అన్న ప్రకారమే శ్రీలీల ఇప్పటివరకు నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకోలేదు..!!