Moviesఒకే ఒక్క ఫోటో షేర్ చేసి సోషల్ మీడియాని మడత పెట్టేసిన...

ఒకే ఒక్క ఫోటో షేర్ చేసి సోషల్ మీడియాని మడత పెట్టేసిన శ్రీ లీల ..అంత స్పెషాలిటీ ఏముందంటే..?

సినిమా ఇండస్ట్రీలో.. ఎప్పుడు..? ఎవరి..? టైం ఎలా మారిపోతుంది..? అన్న విషయం గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువే. దాన్ని మార్చలేము. నేడు స్టార్ గా ఉన్న వాళ్ళు రేపు జీరో అవ్వడం ..అసలు క్రేజ్ లేని వాళ్ళు సూపర్ స్టార్ స్టేటస్ దక్కించుకోవడం చక చకా జరిగిపోతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో హీరోయిన్స్ పరిస్థితి దారుణాతి దారుణంగా ఉంటుంది . ఎప్పుడు ఏం చేయాలో ..?ఏం చేస్తారో..? ఏం చేస్తే ఎలా పొజిషన్ మారిపోతుందో ..? ఎవరికీ అర్థం కాదు.

నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీలో తోపైనా యాక్టర్ గా ఉన్న అందాల ముద్దుగుమ్మ శ్రీలీల ఇప్పుడు ఫేడోట్ బ్యూటీగా మారిపోయింది . గుంటూరు కారం తర్వాత శ్రీ లీల రేంజ్ ఎలా ఢమాల్ అంటూ పడిపోయిందో మనకు తెలిసిందే. కాగా హీరోయిన్ శ్రీ లీల తాజాగా తన క్రేజ్ ని మళ్ళీ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది . ఈ క్రమంలోనే శ్రీ లీల ఏకంగా తన బెడ్ రూమ్ ఫోటోలు షేర్ చేసింది .

తన బెడ్ రూమ్లో బెడ్ పై తన బంధువుల పిల్లలతో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది . ఈ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . ఇప్పటివరకు ఇలాంటి ఫొటోస్ ఎప్పుడూ షేర్ చేయలేదు. అంతేకాదు శ్రీలీలానే వయసులో చిన్నది .. మరి ఆమె పిల్లలపై ఇంత ప్రేమ చూపిస్తూ ఉండడం అభిమానులకి ఆశ్చర్యకరంగా ఉంది. చాలామంది పిల్లలను దత్తత తీసుకొని చదివిస్తుంది శ్రీలీల. ఆ విషయం నిజంగా గ్రేట్ అని చెప్పాలి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news