Moviesరౌడీ హీరో ట్యాగ్ ముందుగా ఆ హీరోకి వెళ్లాల్సిందా..? విజయ్ పేరు...

రౌడీ హీరో ట్యాగ్ ముందుగా ఆ హీరోకి వెళ్లాల్సిందా..? విజయ్ పేరు ముందుకి ఎలా వచ్చిందంటే..?

ఇండస్ట్రీలో రౌడీ హీరో అనగానే.. అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు విజయ్ దేవరకొండ. అందులో డౌట్ లేదు. అలాంటి ఒక క్రేజీ స్థానాన్ని అందుకున్నాడు మన హీరో. అర్జున్ రెడ్డి సినిమాతోనే ఆయన ఈ ట్యాగ్ దక్కించుకున్నాడు . నిజానికి విజయ్ దేవరకొండ కంటే ముందే ఆ ట్యాగ్ ఒక స్టార్ హీరోకి దక్కాల్సింది . ఆయన మరెవరో కాదు ..అల్లు అర్జున్ . ఎస్ అల్లు అర్జున్ – బన్నీ సినిమా తర్వాత రౌడీ హీరో అనే ట్యాగ్ దక్కించుకోవాల్సింది.

ఆ ఎనర్జీ.. ఆ హై పెర్ఫార్మెన్స్.. ఆ బోల్డ్ నెస్ అప్పట్లో కుర్రాళ్లకు పిచ్చెక్కించేసింది. మొదటగా బన్నీకి రౌడీ హీరో అంటూ ట్యాగ్ ఇవ్వాలి అనుకున్నారు . ఆ తర్వాత చాలామంది రౌడీ హీరో కన్నా స్టైలిష్ స్టార్ అయితే బాగుంటుంది అంటూ స్టైలిష్ స్టార్ ట్యాగ్ ఇచ్చారు . ఇప్పుడు ఐకాన్ స్టార్ గా మారిపోయారు. ఆ తర్వాత అదే క్వాలిటీస్ తో వచ్చిన విజయ్ దేవరకొండకు రౌడీ హీరో అనే ట్యాగ్ ఇచ్చేశారు . ఏ మాటక ఆ మాట ఇద్దరికీ ట్యాగ్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది .

అల్లు అర్జున్ తర్వాత ఇండస్ట్రీలో అంత హై పెర్ఫార్మన్స్ చూపించే హీరో విజయ్ దేవరకొండ అనే చెప్పాలి . ప్రెసెంట్ అల్లు అర్జున్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉంటే విజయ్ దేవరకొండ పలు సినిమా షూట్స్ లో బిజీగా ఉన్నాడు . ఆయన ఆఖరిగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా డిజాస్టర్ గా మారిన సంగతి తెలిసిందే. టోటల్ ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా కావడంతో ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు విజయ్ తన ఆశలు నెక్స్ట్ చేస్తున్న సినిమా పై నే పెట్టుకున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news