మనకు తెలిసిందే.. రష్మిక మందన్నా.. క్రేజ్ వేరే లెవెల్ ..ఎంతలా అంటే స్టార్ హీరోల కి మించిపోయిన రేంజ్ లో ఉంటుంది . అందుకే కాబోలు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తన ప్రతి సినిమాకి ప్రమోషన్స్ నిర్వహించడానికి రష్మిక మందననే వాడుకుంటూ వస్తున్నాడు . విజయ్ దేవరకొండ రష్మిక మందన్నాల మధ్య ఏదో సంబంధం ఉంది అని .. త్వరలోనే వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అని తెగ ప్రచారం జరుగుతుంది .
అయితే దాని గురించి ఎప్పటికప్పుడు వీళ్ళు నెగిటివ్ గానే స్పందిస్తూ వస్తున్న .. కొన్ని ఇంటర్వ్యూలలో కొన్ని ఈవెంట్స్ లో మాత్రం పరోక్షంగా మేము ఒకటే అనే విధంగా మాట్లాడుతూ వచ్చారు. తాజాగా రష్మిక అలాంటి కామెంట్స్ చేసింది . ప్రెసెంట్ ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఆనంద్ దేవరకొండ తాజాగా నటించిన సినిమా “గం గం గణేశా”. మే 31వ తేదీ సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు . ఇలాంటి క్రమంలోనే ఆమె పెట్స్ తో దిగిన ఫోటోలు ..అలాగే సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం గురించి అడుగుతారు .
వాటిలో రష్మిక పెట్ విజయ్ పెట్ ని పెట్టీ ఆ ఫోటోలు చూపించి వాటిల్లో ఏది మీ ఫేవరెట్ అని అడగ్గా .. రష్మిక ఆరా నా ఫస్ట్ బేబీ ..స్టార్మ్ నా సెకండ్ బేబీ అని చెప్పడం హైలేట్ గా మారింది. అలాగే నీ ఫేవరెట్ కో స్టార్ ఎవరు అని అడగడంతో.. రష్మిక మైక్ పక్కన పెట్టి ..నీ అబ్బా అని.. ఆనంద్ ని సరదాగా తిట్టింది. అంతేకాదు వెంటనే మైక్ లో ఆనంద్ ని ..అరె నువ్వు నా ఫ్యామిలీ రా ఇలా స్పాట్లో పెడితే ఎలా చెప్పడం అంటూ మాట్లాడడంతో అక్కడ ఉన్న అభిమానులు అంతా సందడి చేశారు “. అంటే పరోక్షంగా విజయ్-రష్మిక ల బంధానీ చెప్పకనే చెప్పేసింది రష్మిక అన్న ఫీలింగ్లో విజయ్ ఫ్యాన్స్ ఉన్నారు . ప్రెసెంట్ దీనికి సంబంధించిన వీడియో నెట్టింట బాగా ట్రెండ్ అవుతూ వస్తుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక లీక్ చేసిన మ్యాటర్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!