Moviesఓరి దేవుడోయ్ ..రష్మిక మందన్నాకు కోపం వస్తే అలా చేస్తుందా..? ఇదెక్కడి...

ఓరి దేవుడోయ్ ..రష్మిక మందన్నాకు కోపం వస్తే అలా చేస్తుందా..? ఇదెక్కడి వింత అలవాటు..!

రష్మిక మందన్నా.. స్టార్ హీరోయిన్.. అందాల ముద్దుగుమ్మ .. నేషనల్ క్రష్ పాన్ ఇండియా లెవెల్ లో పబ్లిసిటీ సంపాదించుకున్న బ్యూటీ. యానిమల్ సినిమాతో బోల్డ్ బ్యూటీగా ట్యాగ్ చేయించుకుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు పుష్ప2 సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి సిద్ధమవుతుంది. హీరోయిన్ రష్మిక మందన్నాకు సంబంధించిన ఒక లేటెస్ట్ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .

ఇది పర్సనల్ లైఫ్ కి సంబంధించింది కావడంతో జనాలు తెలుసుకోవడానికి ఈగర్ గా ఇంట్రెస్టింగ్ గా ఆసక్తి చూపిస్తున్నారు . రష్మిక మందన్నాకు కోపం వస్తే ఏం చేస్తుంది అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. జనరల్ గా ఎవరికైనా కోపం వస్తే ఏం చేస్తారు? నోటికొచ్చినవి మాట్లాడేస్తారు . గట్టిగట్టిగా అరిచేస్తారు . ఇంకా కోపం ఎక్కువ అయితే పక్కనున్న కాస్ట్లీ వస్తువులను పగలగొట్టేస్తారు .

అయితే రష్మిక మందన్నా టూ డిఫరెంట్ . తనకి కోపం వస్తే ఇలా ఏం చేయదట . సైలెంట్ గా రూమ్ లోకి వెళ్లి మెడిటేషన్ చేసుకుంటుందట. లేకపోతే పడుకోమి నిద్రపోతుందట .ఇవన్నీ కాకపోతే ఫుల్ గా నచ్చిన ఫుడ్ ని కుమ్మేస్తుందట . ఆ తర్వాత కూల్ అయ్యి తన కోపానికి కారణం ఎవరు అని తెలుసుకొని ఆ విషయాన్ని సార్టౌట్ చేసుకోవడానికి ఇష్టపడుతుందట. ఈ క్వాలిటీ రష్మిక మందన్నాలో ఉంది అని తెలియడంతో జనాలు షాక్ అయిపోతున్నారు. ఇలా కూడా ఉంటారా అంటూ ఆశ్చర్యకరంగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news