ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువగా చూస్తున్నాం. మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రెటీస్ డబ్బున్న పిల్లలు ఎలా తమ వైవాహిక జీవితాన్ని సగంలోనే తుంచేస్తున్నారో బాగా బాగా వింటున్నాము. కాగా సోషల్ మీడియాలో కొంతమంది విడాకులు తీసుకోకపోయిన సరే వాళ్ళు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ నమిత తన భర్తతో విడాకులు తీసుకోబోతుంది అన్న ప్రచారం ఎక్కువగా జరిగింది. జెమినీ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తనదైన స్టైల్ లో పలు సినిమాల్లో నటించింది .
ముఖ్యంగా ప్రభాస్ బిల్లా ..బాలయ్య సింహ సినిమాలతో అమ్మడు రేంజ్ భారీగా పెరిగిపోయింది . మారిపోయింది ..కాగా ఆఫర్లు రాకపోవడంతో వీరేంద్ర చౌదరిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నమిత 2022లో కవల పిల్లలకు జన్మనిచ్చింది . ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చి ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది . సోషల్ మీడియాలో కూడా నిరంతరం యాక్టివ్ గా ఉంటుంది . తాజాగా నమిత భర్తతో మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకోవాలని అనుకుంటుంది అంటూ కోలివుడ్ మీడియాలో వార్తలు పుట్టుకొచ్చాయి . దీనిపై ఓపెన్గా స్పందించింది .
“అసలు నా భర్తతో నేను విడాకులు తీసుకుంటున్నాను అని ఎలా అనుకున్నారో ఏంటో.. నా భర్త నేను విడాకులు తీసుకోవడం లేదు.. ఈ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదు.. నా భర్త నేను ఫ్యామిలీ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాం.. మా ఫోటోలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి కదా.. మరి మేము విడాకులు తీసుకుంటున్నామని ఏ విధంగా అనుకుంటారు..? ఎలాంటి ఆధారాలతో మేము విడిపోయామని ప్రచారం చేస్తున్నారు..? నాకైతే తెలియదు. సినిమా ఇండస్ట్రీలో ఇవి కామన్ అయినప్పటికీ కొన్నిసార్లు ఫ్యామిలీస్ పరంగా ఇబ్బందులు తలెత్తుతాయి. ఇలాంటి వార్తలు సృష్టించే వాళ్ళకి పనీపాటా లేదనుకుంటాను “అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయిపోయింది . నమిత కోపంగా మాట్లాడిన ఫైనల్లీ విడాకులు తీసుకోవట్లేదు అంటూ గుడ్ న్యూస్ చెప్పడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు..!!