ఈ మధ్యకాలంలో స్టార్ హీరోస్ ఎలా హై రెమ్యూనిరేషన్ డిమాండ్ చేసి చార్జ్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఒకప్పుడు సినిమాకి కోటి రూపాయలు ఇవ్వడమే పెద్ద గగనంగా మారిపోయేది. ఆ తర్వాత క్రమక్రమంగా ఆసంఖ్య పెరుగుతూ వచ్చింది. 10 – 15 – 20 అంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చింది. కాగా రీసెంట్ గా స్టార్స్ ఒక్కొక్కరు 100 కోట్ల రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్న హీరో 100 కోట్లు 150 కోట్లు ఛార్జ్ చేస్తూ ఉండడం గమనార్హం.
పుష్ప 2 సినిమాకి అల్లు అర్జున్ ఏకంగా 120 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడట . అదే విధంగా కల్కి సినిమాకి ప్రభాస్ 150 కోట్లు ఛార్జ్ చేశాడట . రామ్ చరణ్ – బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకి 100 కోట్లు ఛార్జ్ చేశారట . ఇప్పుడు ఇదే హైలెట్గా మారింది . స్టార్ లు ఇలా పారితోషకం పెంచుకుంటూ పోతే ఖచ్చితంగా బడ్జెట్ అనేది పెరిగిపోతుంది అంటున్నారు సినీ ప్రముఖులు . అయితే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కి అలాంటి రెమ్యూనరేషన్ తీసుకున్న ఓకే ..చిన్నాచితకా కాన్సెప్ట్ ఉన్న ప్రాజెక్టుకి కూడా 100 కోట్లు అంటే అది టూమచ్ అని అంటారు .
ప్రెసెంట్ ఇప్పుడు రామ్ చరణ్ అదే ట్రోలింగ్ ఫేస్ చేస్తున్నాడు . బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు రామ్ చరణ్. ఇది స్పోర్ట్స్ డ్రామా .. పెద్ద హైలెట్ కాన్సెప్ట్ అని చెప్పలేము.. పుష్ప2 – కల్కి – దేవర అంత పెద్ద కాన్సెప్ట్ మూవీ కాదు ..మరి ఎందుకు చరణ్ 100 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడు . పాన్ ఇండియా హీరో అయితే 100 కోట్లు ఇవ్వాల్సిందేనా..? అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి .
అంతేకాదు ఆర్ ఆర్ ఆర్ సినిమాకి 70 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు చరణ్ అంటూ ప్రచారం జరిగింది . అయితే ఆ తర్వాత గేమ్ చేంజర్ సినిమా విషయంలో కూడా రామ్ చరణ్ అంతే రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. మరి బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకి ఎందుకు 100 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడు..? అనేది ప్రశ్నార్ధకంగా మారింది . ఇప్పుడు ఇదే విషయం హైలైట్ గా మారింది . కొంతమంది రామ్ చరణ్ కూడా రెమ్యూనిరేషన్ కోసం కక్కుర్తి పడుతున్నాడా..? కర్మ కర్మ అంటూ అసహనంగా కామెంట్స్ పెడుతున్నారు..!!