Moviesఅఫీషియల్: పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్..ఆ హ్యాండ్ సమ్ హీరోతోనే..!

అఫీషియల్: పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్..ఆ హ్యాండ్ సమ్ హీరోతోనే..!

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో పెళ్లి చేసుకున్న స్టార్ సెలబ్రెటీల లిస్ట్ ఎక్కువ అయిపోతుంది. వయసుతో సంబంధం లేకుండా పలువురు బడా స్టార్ హీరోలు.. హీరోయిన్లు.. క్యారెక్టర్ ఆర్టిస్టులు.. కమెడియన్లు.. పెళ్లిళ్లు చేసుకుంటున్నారు ..కొంతమంది చాలా చిన్న ఏజ్ లోనే పెళ్లిళ్లు చేసేసుకుంటూ ఉండగా మరికొంతమంది 40 ఏళ్ల వయసు దాటాక పెళ్లిపై మోజుపడుతూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇండస్ట్రీలో సంచలనంగా మారుతున్నాయి. తాజాగా భారత సంతతికి చెందిన ఎన్నారై బ్యూటీ హీరోయిన్ విమల రామన్.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్త నెట్టింట వైరల్ గా మారింది .

విమల రామన్ తెలుగులో గాయం 2 ..రంగాది దొంగ లాంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది . విమల రామన్ తల్లితండ్రులు ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. ఆమె పుట్టి పెరిగింది అంతా అక్కడే .. సినిమాలపై ఉండే ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ తో మోడలింగ్ స్టార్ట్ చేసింది . ఆ తర్వాత అవకాశాలు వెతుక్కుంటూ ఇండియాకు వచ్చింది . గాయం 2 విమల రామన్ ఎందుకు క్రేజీ హీరోయిన్ గా మారలేకపోయింది. ప్రజెంట్ విమల రామన్ వయసు 42 ఏళ్లు ఆమె ఇంతవరకు పెళ్లనే ఊసే ఎత్తలేదు.. రీసెంట్గా పెళ్లిపై మోజు పడినట్లుంది ..అందుకే ఇన్నాళ్లు సీక్రెట్ గా దాచిపెట్టిన.. తన బాయ్ ఫ్రెండ్ ను ఇప్పుడు రివిల్ చేసింది .

హనుమాన్ సినిమాతో సూపర్ విలన్ గా గుర్తింపు సంపాదించుకున్న వినయ్ రాయ్ తో ప్రేమాయాణం ఉందనే ప్రచారం చాలా రోజుల నుంచి వినపడుతున్నాయి . అయితే రీసెంట్ గా ఆమె ఆ విషయాన్ని కన్ఫామ్ చేసింది . వినయ్ రాయ్ తో విమల రామన్ రొమాంటిక్ ఫొటోస్, ఫోటోషూట్స్ చేసి ఆ ఫొటోస్ సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది . దీంతో వీళ్లిద్దరి మధ్య ప్రేమ కన్ఫామ్ అని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు వీళ్లిద్దరు దిగిన రొమాంటిక్ స్టిల్స్ చూస్తే వావ్ అనేది రేంజ్ లో ఉన్నాయి. దీంతో సోషల్ మీడియాలో వీళ్ళ ఫొటోస్ బాగా ట్రెండ్ అవుతుంది..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news