Movies"అదుర్స్" తర్వాత నయనతార-ఎన్టీఆర్ కాంబోలో మిస్సయిన.. ఆ సూపర్ డూపర్ బ్లాక్...

“అదుర్స్” తర్వాత నయనతార-ఎన్టీఆర్ కాంబోలో మిస్సయిన.. ఆ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు భలే ముద్దుగా ఉంటాయి . బాగా అట్రాక్టివ్ గా కూడా ఉంటాయి . ఎలా అంటే వన్స్ ఆ కాంబోలు సెట్ అయితే మాత్రం అభిమానులు విచ్చలవిడిగా ఆ జంటను లైక్ చేస్తూ ఉంటారు . కాగా సోషల్ మీడియాలో అలాంటి ఒక కాంబోకి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇండస్ట్రీలో ఎంతోమంది హీరో హీరోయిన్స్ స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉంటారు . కానీ జనాలకి మాత్రం కొంతమంది నచ్చుతూ ఉంటారు . వాళ్ళల్లో ఒకరే నయనతార – ఎన్టీఆర్ .

వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన సినిమా అదుర్స్ . ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనే దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సూపర్ డూపర్ హిట్ సినిమా.. టీవీలో చూస్తూ ఉంటే నవ్వని వ్యక్తి అంటూ ఉంటారా..?. కాగా అదుర్స్ తర్వాత వీళ్ళ కాంబోలో మరొక సినిమా రావాల్సింది కానీ కొన్ని కారణాల చేత అది ఆగిపోయింది. నయనతారనే రిజెక్ట్ చేసింది అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది .

ఆ సినిమా మరేదో కాదు జనతా గ్యారేజ్ . ఎస్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఎన్టీఆర్ కెరియర్ మరోసారి మలుపు తిప్పింది . ఈ సినిమాలో నయనతార నిత్యామీనన్ పాత్రలో కనిపించాల్సి ఉండిందట. కానీ ఆమెకు ఈ పాత్ర నచ్చక రిజెక్ట్ చేసిందట . అప్పట్లో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అయింది . ఒప్పుకుని ఉంటే మాత్రం వీళ్ళ కాంబోలో మరో సినిమా పక్క హిట్ అందుకునేది అని చెప్పడంలో సందేహం లేదు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news