Movies"మొరటోడు మొండోడు"..వామ్మో ఏం పాట రా బాబు.. పుష్పరాజ్ గాడి కటౌట్...

“మొరటోడు మొండోడు”..వామ్మో ఏం పాట రా బాబు.. పుష్పరాజ్ గాడి కటౌట్ కి పర్ఫెక్ట్ లిరిక్స్(వీడియో)..!!

ఫైనల్లీ ..పుష్పరాజ్ గాడి స్టామినా మేనియా.. అంటే ఇదే అంటూ ప్రూవ్ చేసే విధంగా సుకుమార్ పుష్ప2 నుంచి సెకండ్ పాటను రిలీజ్ చేశారు. ఆల్రెడీ పుష్ప2 సినిమా నుంచి ఫస్ట్ పాట విడుదలైంది. పుష్ప పుష్ప పుష్ప అంటూ సాగే ఈ పాట అభిమానులను ఆకట్టుకుంది . అయితే ఈ పాట రిలీజ్ అయిన తర్వాత ఓ వర్గం ప్రేక్షకులు నెగిటివ్గా స్పందించిన విషయం తెలిసిందే. అలాంటి జనాలను కూడా మెస్ మరైజ్ చేసేందుకు ఈసారి ఏకంగా డ్యూయెట్ రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశాడు సుకుమార్ .

కొద్దిసేపటి క్రితం పుష్ప 2 నుంచి సెకండ్ పాట రిలీజ్ అయింది . “సూసేటి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామీ”.. అనే సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది . మెలోడియస్ సింగర్ శ్రేయ ఘోషల్ ఈ పాటను ఆలపించింది . అద్దిరిపోయే రేంజ్ లో ఈ పాటను పాడి మెప్పించింది. కాగా రష్మిక మందన్నా.. అల్లు అర్జున్ ఈ పాటకు అద్దిరిపోయే రేంజ్ లో ఇరగదీసే విధంగా స్టెప్ చేశారు .

మరి ముఖ్యంగా ఒకరిని ఒకరు హగ్ చేసుకుంటూ వేసిన స్టెప్ ఈ పాటకి హైలైట్ గా మారింది. కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాని ఊపు ఊపేస్తుంది. మరీ ముఖ్యంగా “మొరటోడు మొండోడు అయినా మంచివాడు నా వాడు” అనే లిరిక్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి . పుష్పరాజ్ గాడి కటౌట్ కి పర్ఫెక్ట్ లిరిక్స్ అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు అభిమానులు. చూస్తూ ఉంటే పుష్ప2 గ్లోబస్ స్థాయి రికార్డ్స్ బద్దలు కొట్టడం పక్క అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. మరి ఎందుకు ఆలస్యం అద్దిరిపోయే రేంజ్ లో ఉన్న సామీ పాటను మీరు విని ఎంజాయ్ చేయండి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news