Moviesవెయ్యికోట్లు ఇచ్చిన రాని కిక్.. బాలయ్య అభిమానులకు ఈ ఒక్క వార్త...

వెయ్యికోట్లు ఇచ్చిన రాని కిక్.. బాలయ్య అభిమానులకు ఈ ఒక్క వార్త వింటే వచ్చేయేదా..? సూపర్ క్రేజీ న్యూస్ వచ్చేసిందిరోయ్..!

నందమూరి అభిమానుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో.. బాలయ్యను ఎలా ప్రమోట్ చేస్తూ ఉంటారో.. బాలయ్య చేసే పనుల్ని ఎలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారో.. అందరికీ తెలిసిన విషయమే . మరీ ముఖ్యంగా ప్రజెంట్ ఇప్పుడు నందమూరి బాలయ్య అభిమానులు ఈగర్ గా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు. మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తాడా..? తాత నాన్న పేరు నిలబెడతాడా..? అంటూ బాగా ఈగర్ గా కళ్ళల్లో వత్తులు వేసుకొని వెయిట్ చేస్తున్నారు.

కాగా జూన్ 10వ తేదీ బాలయ్య పుట్టినరోజు . ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన రెండు సినిమా కీలక అప్డేట్స్ రాబోతున్నట్లు ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. సాధారణంగా ఏ స్టార్ హీరో అయినా సరే తన పుట్టినరోజుకు సంబంధించిన డీటెయిల్స్ ఇస్తూనే ఉంటారు . ఈ క్రమంలోనే బాలయ్య సైతం బాబీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకి సంబంధించిన టైటిల్ టీజర్ తో పాటు అఖండ 2 కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా ఇవ్వబోతున్నారట .

ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. బాలయ్య మోక్షజ్ఞ ఎంట్రీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ని కూడా అదే రోజు రివిల్ చేయబోతున్నారట . దీంతో బాలయ్య ఫ్యాన్స్ సూపర్ ఎక్సయిటెడ్ గా ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నారు. బాలయ్య ఓ రేంజ్ లో అభిమానులను ఆరోజు సాటిస్ఫై చేయబోతున్నారు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ రోజు రచ్చ రంబోలానే నో డౌట్ ..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news