Moviesఎన్టీఆర్ తన పిల్లలకు పెట్టిన ప్రతి పేరులోను అది ఉంది..మీరు గమనించారా..సో...

ఎన్టీఆర్ తన పిల్లలకు పెట్టిన ప్రతి పేరులోను అది ఉంది..మీరు గమనించారా..సో సో స్పెషల్..!

మనకు తెలిసింది ..నేడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి . ఈ సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు నందమూరి ఫ్యాన్స్ ఆయనకు సంబంధించిన విషయాలను తలుచుకుంటున్నారు . ఇప్పటికే ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు . నందమూరి తారక రామారావుకు 12 మంది సంతానం . ఎనిమిది మంది అబ్బాయిలు.. నాలుగు మంది అమ్మాయిలు . వీరికి ఎన్టీఆర్ చాలా చాలా ప్రత్యేకంగా ఉండే పేర్లను పెట్టారు . దాని వెనక పెద్ద అర్థం కూడా ఉంది .

1923 మే 28 నాయన జన్మించారు తారక రామారావు గారు. వెండితెరపై తిరుగులేని రారాజుగా ఎదిగిన ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి స్టార్ స్టేటస్ అందుకున్నాడో.. రాజకీయాలలోనూ అలాంటి ముద్రనే వేసుకున్నారు ..పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టాడు.. అంటే ప్రజల్లో ఆయనపై ఎంత నమ్మకం ఉంది అనే విషయం అర్థం చేసుకోవచ్చు. కాగా ఎన్టీఆర్ తన పిల్లల పేర్లను చాలా ప్రత్యేకంగా పెట్టారు . అబ్బాయిల పేర్లు చివరిన కృష్ణ వచ్చేలా అమ్మాయిల పేర్లు చివరన ఈశ్వరి అనే వచ్చేలా పెట్టుకోవచ్చారు .

రామకృష్ణ ..సీనియర్ జయకృష్ణ ..సాయి కృష్ణ ..హరికృష్ణ ..మోహనకృష్ణ ..బాలకృష్ణ ..జూనియర్ జయకృష్ణ.. ఎన్టీఆర్ కుమారులు. మీరు గమనించినట్లయితే వీరందరి పేర్ల చివరినా కృష్ణా అని ఉండడం స్పెషల్ . అలాగే అమ్మాయిల పేర్లను పరిశీలిస్తే పురందేశ్వరి.. భువనేశ్వరి ..లోకేశ్వరి ..ఉమామహేశ్వరి అనే పేర్లను పెట్టుకొచ్చారు . ఎన్టీఆర్ ప్రతి పేరు చివరన కూడా ఈశ్వరి వచ్చేలా చాలా డిఫరెంట్ గా పేర్లను సెలెక్ట్ చేసుకున్నారు . ఎన్టీఆర్ తన కూతుర్లు కొడుకుల పేర్లు విషయంలో ఒక ప్రాస ఫాలో అయ్యారు . ఎన్టీఆర్ కి దైవభక్తి ఎక్కువ అందుకే లార్డ్ కృష్ణ పేరు కొడుకులకు అలాగే శివుడు మరొక పేరుగా ఈశ్వరుడులోని ఈశ్వరి అమ్మాయిల పేర్లలో చివర వచ్చేలా చూసుకున్నాడు . ప్రజెంట్ దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news