Moviesపుష్ప2 విషయంలో సుకుమార్ కి కొత్తగా తలనొప్పులు స్టార్ట్.. లాస్ట్ మినిట్...

పుష్ప2 విషయంలో సుకుమార్ కి కొత్తగా తలనొప్పులు స్టార్ట్.. లాస్ట్ మినిట్ లో నమ్మించి ముంచేసాడుగా..!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఎప్పటికప్పుడు పుష్ప2 విషయంలో ఏదో ఒక కాంట్రవర్సీ జరుగుతూనే ఉంది . మొన్నటికి మొన్న బన్నీ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం సుకుమార్ పుష్ప2 విషయంలో ఎంత తలనొప్పులు క్రియేట్ చేసిందో మనం చూసాం . పోలిటికల్ పరంగా వేలు పెట్టి బన్నీ కొత్త సమస్యే కొని తెచ్చుకున్నాడు. అయితే తాజాగా మరొకసారి అదేవిధంగా పుష్ప2 కి భారీ సమస్య వచ్చి చేరింది అన్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.

పుష్ప 2 విషయంలో సుకుమార్ కొత్త తలనొప్పులు ఫేస్ చేస్తున్నాడట . ఈ సినిమాకి విలన్ గా నటిస్తున్న ఫహద్ ఫజిల్.. లాస్ట్ మూమెంట్లో కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నాడట . నిజానికి అనుకున్న దానికన్నా ఎక్కువగా కాల్ షీట్స్ కావాల్సి వచ్చింది అంట. అయితే ఒక మలయాళం సినిమాకి అదే తేదీన కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయడం ఇప్పుడు పుష్ప2కి అడ్జస్ట్ చేయలేకపోవడంతో.. సినిమా షూట్ ఆగిపోయే పరిస్ధితి వచ్చిందట.

బన్నీ మిగతా నటీనటులు ఆ టై కాల్ షీట్స్ లో పాల్గొనాల్సి ఉండడంతో ఫహద్ ఫజిల్ కారణంగా ఏకంగా 15 రోజులు ఈ సినిమా షూట్ ఆలస్యం కాబోతుందట . అంతేకాదు సుకుమార్ రాసుకున్న కొన్ని కొన్ని సీన్స్ ఎలివేషన్స్ బాగా రాకపోవడంతో .. మళ్లీ రీ షూట్ చేయాలి అంటూ భావిస్తున్నారట . అసలకే రిలీజ్ టైం దగ్గర పడిపోయింది.. ఇంకా రెండు పాటలు చిత్రీకరించాలి .. కొన్ని ఫైట్ సీన్స్ ఉన్నాయి .. ఇవన్నీ ఎప్పుడు కంప్లీట్ చేస్తాడు..? సినిమా ప్రమోషన్స్ ని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు ..? అంటూ ఫ్యాన్స్ భయపడిపోతున్నారు . అయితే పుష్ప రాజ్ మాత్రం తగ్గేదేలే అన్న రేంజ్ లో ధీమా వ్యక్తం చేస్తున్నాడు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news