Moviesత్రివిక్రమ్ శ్రీనివాస్ రావు టైం ఎంత బ్యాడ్ గా ఉందంటే .....

త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు టైం ఎంత బ్యాడ్ గా ఉందంటే .. దరిద్రానికే దరిద్రం అంటే ఇదే..!?

సినిమా ఇండస్ట్రీలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావుకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . ఆయన ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ ..ఆయన కధ అందించే సినిమాలు సూపర్ సూపర్ హిట్ అవుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా జనాలను ఆకట్టుకునే విధంగా ఆయన డైలాగ్స్ రాస్తూ ఉంటారు . వాడుక భాషలో మనం ఎప్పుడో ఒకసారి వాటిని వాడుతూనే ఉంటాం.

అరెరే ఈ డైలాగ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కి ఎలా తట్టింది అని అనుకోక తప్పదు . కాగా ఆయన లాస్ట్ గా తెరకెక్కించిన సినిమా గుంటూరు కారం. ఈ సినిమా భారీ స్థాయిలో డిజాస్టర్ గా మారింది. మహేష్ బాబును అభిమానులు చేత బూతులు తిట్టేలా చేసింది . ఆఫ్ కోర్స్ త్రివిక్రమ్ కూడా హ్యూజ్ ట్రోలింగ్ కి గురి అయ్యారు . కాగా రీసెంట్గా త్రివిక్రమ్ కు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు – రామ్ చరణ్ తో మూడు సినిమాలు చేయాల్సింది.. మూడు సినిమాలు కూడా కుదిరినట్లు కుదిరి లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయిపోయాయి.

దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్ గా మారింది . త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కొన్ని కారణాల చేత రామ్ చరణ్ తో సినిమాలు తెరకెక్కించలేకపోయారట. ఈ న్యూస్ ఇప్పుడు బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రజెంట్ అల్లు అర్జున్ తో ఒక సినిమాకి కమిట్ అయిన త్రివిక్రమ్ ఆ తర్వాత రామ్ పోతినేని తో ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దాం మరి త్రివిక్రమ్ ఎలా తన తలరాత మార్చుకుంటాడో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news