ఈ మధ్యకాలంలో డార్లింగ్ మాటలను కూడా నమ్మడం మానేశారు రెబెల్ అభిమానులు . అది ఎందుకో మనందరికీ తెలిసిందే . పాపం ఎప్పుడు కూడా సినిమా ప్రమోషన్స్ కోసం తన పర్సనల్ లైఫ్ ను వాడుకునిందే లేదు ప్రభాస్ . కెరియర్ లో ఫర్ ద ఫస్ట్ టైం కల్కి సినిమా కోసం పెద్ద తప్పే చేశాడు ప్రభాస్ . దీంతో రెబల్ ఫ్యాన్స్ ఆయన మాటలను నమ్మడమే మానేశారు . రెబల్ ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తూ ప్రభాస్ తీసుకున్న నిర్ణయం అభిమానులకి బాగా మండిపోయేలా చేసింది . తన లైఫ్ లోకి ఒక స్పెషల్ పర్సన్ రాబోతున్నారు అంటూ ప్రకటించేసాడు . దీంతో పెళ్లి వార్తను కన్ఫామ్ చేసేసుకున్నారు అభిమానులు .
అయితే అది పెళ్లి కాదు అని కల్కి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బుజ్జి పాత్రను ఇంట్రడ్యూస్ చేసే ఈవెంట్ అని క్లారిటీకి వచ్చేసింది . దీంతో రెబల్ ఫ్యాన్స్ డీప్ గా హర్ట్ అయ్యాడు. పీకల్లోతు ప్రభాస్ పై కోపంగా ఉన్నారు. అలాంటి వాళ్ళని కూల్ చేసేందుకు ప్రభాస్ మరొక నిర్ణయం తీసుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక లవబుల్ సినిమా స్టోరీ ని ఓకే చేసిన విషయం తెలిసిందే .
ఈ సినిమాలో హీరోయిన్గా అందాల ముద్దుగుమ్మ సాయి పల్లవి సెలెక్ట్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. నిజానికి సాయి పల్లవి ప్రభాస్ కాంబోలో సినిమా రావాలి అంటూ జనాలు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. . ప్రభాస్ కి కూడా ఆ విషయం తెలుసు. ఓ ఇంటర్వ్యూలో ఆ విషయం గురించి ఓపెన్ గా మాట్లాడాడు . కానీ హైట్ ప్రాబ్లం అంటూ చెప్పుకు వచ్చాడు. అయితే ఇది లవ్ స్టోరీ కావడంతో లవ్ కి కులమత బేధాలు హైట్ వెయిట్ అడ్డు రావు అని చెప్పే క్రమంలోనే హీరోయిన్ సాయి పల్లవి ని ఈ సినిమాలో చూస్ చేసుకున్నారట . దీంతో కోట్లాదిమంది అభిమానులు వెయిట్ చేస్తున్న ఆ కాంబో త్వరలోనే రాబోతుంది అంటున్నారు జనాలు..!!