ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎవరిని కదిలించిన చెప్పే ఒకే ఒక్క పేరు పుష్ప ..పుష్ప రాజ్ . మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఈ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు . ఆగస్టు 15వ తేదీ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాకి సంబంధించిన ఒక్క అప్డేట్ వచ్చిన ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఊగిపోతూ ఉంటారు . మరి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు లో ఉండే జనాలు ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు.
ఇలాంటి క్రమంలోనే సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ అభిమానులను టెన్షన్ పెడుతుంది. సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ సినిమా బిజినెస్ రికార్డులు బ్రేక్ చేస్తుంది. అందరూ ఊహించిన విషయమే ఇది . అయితే పుష్ప మూవీ కంటే రెండింతలు బిజినెస్ రాబట్టాలి అని అంతా అనుకున్నారు. అయితే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల నుంచి జరుగుతున్న బిజినెస్ మాత్రం ట్రేడ్ వర్గాలకు కంగారు పుట్టిస్తుంది . ఈ సినిమాకు రెమ్యూనరేషన్లు పెరగడంతో బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయినట్లు తెలుస్తుంది . దాంతో నిర్మాతలు తెలుగు థియేటర్ రైట్స్ కు భారీ రేట్స్ చెప్పడం సహజం .
అయితే డిస్టబ్యూటర్స్ ఆ స్థాయి రేట్లు అందుకోలేమని చేతులెత్తేస్తున్నారట. నాన్ రీఫండ్డబుల్ రైట్స్ భారీ మొత్తం ఇచ్చి తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదట . అడ్వాన్స్ ఇచ్చే సినిమాను తీసుకుంటామని చెప్తున్నారు . సినిమా ఎంత బాగా ఆడిన ఎక్కువ రేట్లు పెడితే రికవరీ అవ్వదని అంటున్నారు జనాలు . మరి ముఖ్యంగా ఆంధ్రాలో థియేటర్ రేట్లు స్పెషల్ షోలు పర్మిషన్స్ సమస్య కావడం ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కు పెద్ద తలనొప్పిగా మారింది . మరి మైత్రి మూవీ వారు ఏం చేస్తారో ..? ఈ విషయంలో అనే డౌట్లు కూడా ఉన్నాయి . ప్రెసెంట్ ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!!