MoviesNKR21 స్పెషల్ గ్లింప్స్ చూశారా..కళ్యాణ్ రామ్ పంచ్ అద్దిరిపోయిందిగా.. గూస్ బంప్స్...

NKR21 స్పెషల్ గ్లింప్స్ చూశారా..కళ్యాణ్ రామ్ పంచ్ అద్దిరిపోయిందిగా.. గూస్ బంప్స్ మోతే(వీడియో)..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న కళ్యాణ్ రామ్ బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలకు కమిట్ అవుతున్న విషయం తెలిసిందే. బింబిసార సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఆ తర్వాత అమిగోస్ సినిమాతో తన నటనకు మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతూ ఉన్నాడు . గత ఏడాది ఎన్ కే ఆర్ 21 అనే వర్కింగ్ టైటిల్ తో నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా అని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.

ఈ సినిమాపై హ్యూజ్ పెట్టుకొని ఉన్నారు నందమూరి అభిమానులు. డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లను తెరకెక్కించడం ఈ మధ్యకాలంలో కళ్యాణ్రామ్ ఎక్కువగా చేస్తున్నాడు. కాగా ఎన్ కె ఆర్ 21 సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ షేర్ చేయగా పిడికిలి బిగించి ఉన్న కళ్యాణ్రామ్ చేతి పై రక్తపు మరకలు ఉన్న లుక్ ఇప్పటికె సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాని ప్రదీప్ చిలకూరి డైరెక్ట్ చేస్తున్నాడు . అంతేకాదు ఫుల్ టు ఫుల్ యాక్షన్ జోనర్ గా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది .

నేడు టిడిపి వ్యవస్థాపకుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ ఎన్ కె ఆర్ 21 గ్లింప్స్ ను షేర్ చేసింది కళ్యాణ్ రామ్ టీం. షూటింగ్స్ స్పాట్ నుంచి కొన్ని విజువల్స్ ని కూడా షేర్ చేసింది. దీనితో సినిమాపై సూపర్ డూపర్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. గ్లింప్స్ తోనే సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాడు కళ్యాణ్ రామ్. కచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . అంతేకాదు కళ్యాణ్ రామ్ తనదైన స్టైల్ లో ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాడు. ఇప్పుడు ఫ్యాన్స్ కి ఈ సినిమా మరింత ఆసక్తికరంగా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news