Moviesరామ్ చరణ్ మొబైల్ వాల్ పేపర్ చూశారా.. ఎవరి ఫోటో పెట్టుకున్నాడో...

రామ్ చరణ్ మొబైల్ వాల్ పేపర్ చూశారా.. ఎవరి ఫోటో పెట్టుకున్నాడో తెలుసా..?

రామ్ చరణ్ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ హీరో.. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న వన్ ఆఫ్ ద బడా హీరో.. మెగాస్టార్ చిరంజీవి వన్ అండ్ ఓన్లీ కొడుకు ..ఇంతకంటే పెద్దగా ఇంట్రడక్షన్ చెప్పాలా..? సోషల్ మీడియాలో నిరంతరం రామ్ చరణ్ కి సంబంధించిన వార్తలు ఏదో ఒకటి ట్రెండ్ అవుతూనే ఉంటాయి . మరి ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ క్రేజ్ ఏ రేంజ్ లో మారిపోయిందో మనకు తెలుసు. సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ పేరు మారు మ్రోగిపోతుంది .

కాగా.. రీసెంట్గా రాంచరణ్ కి సంబంధించిన ఒక న్యూస్ వైరల్ గా మారింది . మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే . ఢిల్లీలో ఘనంగా కుటుంబ సభ్యుల సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు . ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ – ఉపాసన కూడా హాజరయ్యారు . ఈ క్రమంలోనే రామ్ చరణ్ చేతిలో ఉన్న ఫోన్ వాల్ పేపర్ పిక్చర్ మీడియా కంటపడింది .

జనరల్ గా వాల్ పేపర్ ని తమ ఫోటో.. తమ భార్య ఫోటో ..లేదా పిల్లలు ఫోటో పెట్టుకుంటూ ఉంటారు స్టార్ సెలబ్రెటీస్ . అయితే రామ్ చరణ్ మాత్రం పూర్తిగా దైవస్మరణ కలిగిన వ్యక్తి . ఆంజనేయ స్వామి ఫోటోని పెట్టుకున్నారు . ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఇది తెలుసుకున్న అభిమానులు రాంచరణ్ ఎంత భక్తి గల వ్యక్తి అని ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news