మనకు తెలిసిందే.. సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు ప్రభాస్ – గోపీచంద్ . జాన్ జిగిడి దోస్తులనే చెప్పాలి. వర్షం సినిమాలో ప్రభాస్ హీరోగా నటించిన గోపీచంద్ విలన్ పాత్రులో నటించి మెప్పించారు . ఈ సినిమా రిలీజ్ అయి కొన్ని సంవత్సరాలు అవుతుంది . కానీ ఇప్పటికీ టీవీలో టెలికాస్ట్ అయితే మాత్రం జనాలు కళ్లు అప్పగించుకొని అస్సలు బోర్ కొట్టకుండా చూస్తారు. అలాంటి ఓ హై లెవెల్ పర్ఫామెన్స్ కనుబరిచారు గోపీచంద్ అలాగే ప్రభాస్ .
ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబోలో సినిమా రావాలి అని చాలామంది మేకర్స్ ట్రై చేశారు . కానీ కుదరలేదు. ఇక ఫ్యూచర్లో ఆ కాంబో వస్తుందో లేదో కూడా తెలియదు. రీసెంట్ గా సోషల్ మీడియాలో ప్రభాస్ – గోపీచంద్ ముక్కు పగలగొట్టారు అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ నవ్వితే పక్కనున్న మనుషుల్ని నెట్టే కొన్ని అలవాట్లు ఉన్నాయట. ఈ విషయాన్ని స్వయాన ఓ ఇంటర్వ్యూలో ప్రభాసే చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే గోపీచంద్ ని రెబల్ స్టార్ అలా నెట్టడం.. కొట్టడం చేస్తూ ఉండగా ఓ రోజు ఏకంగా ముక్కు పగిలిపోయిందట .
“అరే ఈరోజు నవ్వితే నన్ను కొట్టొద్దని ముందే చెప్పాడట.. అయినా కూడా ప్రభాస్ వినిపించుకోకుండా అలవాటులో పొరపాటుగా కొట్టేసాడట.. గోపీచంద్ ముక్కు నుంచి రక్తం కూడా కారి హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకునే వరకు వెళ్లిందట”. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఫన్నీగా నవ్వుకుంటున్నారు . ఫ్రెండ్స్ మధ్య ఇవన్నీ కామన్.. అందుకే వాళ్ళు అంత మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు అంటూ చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ప్రభాస్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు . గోపీచంద్ కూడా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు..!