Movies"గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" సినిమాను ఆ పాన్ ఇండియా హీరో చేయాల్సిందా.....

“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమాను ఆ పాన్ ఇండియా హీరో చేయాల్సిందా.. విశ్వక్సేన్ చేతికి ఎలా వెళ్ళిందంటే..?

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే.. ఒకటే పేరు మారుమ్రోగిపోతుంది . అదే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి .. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ కా దాస్ అనే బిరుదు అందుకుని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విశ్వక్సేన్ .. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన మూవీ. సినిమా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి – నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు .

ఎవరి పాత్రకు తగ్గ న్యాయం వారు చేశారు . ముఖ్యంగా విశ్వక్సేన్ ఈ సినిమాకి కర్త -కర్మ-క్రియ అని చెప్పాలి . తనదైన స్టైల్ లో ఆకట్టుకున్నాడు. అంతేకాదు బోల్డ్ డైలాగ్స్ తో రచ్చ లేపాడు. మరి ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ కి వచ్చే ముందు ఒక డైలాగ్ చెప్తాడు . అది కెవ్వు కేక .. థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తేనే సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది.

థియేటర్స్ లో ఈ సినిమాలు చూసిన జనాలు విశ్వక్సేన్ ప్లేస్ లో జూనియర్ ఎన్టీఆర్ ఉంటే ఈ సినిమా వేరే లెవెల్ లో ఉండేది అని ..సూపర్ డూపర్ హిట్ కాదు బాక్స్ ఆఫీస్ చరిత్ర తిరగరాసేది అని మరి ముఖ్యంగా ఆ పంచ్ డైలాగ్స్.. ఆ పొలిటికల్ లీడర్స్ కి ఇచ్చి పడేసి గూస్ బంప్స్ డైలాగ్స్ ఎన్టీఆర్ నోట వింటే అభిమానులకు రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందేనని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. విశ్వక్సేన్ సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . చూద్దాం మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news