Movies"గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" మూవీ రివ్యూ: విశ్వక్ సేన్ మాస్ ఫీస్ట్.....

“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” మూవీ రివ్యూ: విశ్వక్ సేన్ మాస్ ఫీస్ట్.. విశ్వరూపం చూపించాడుగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ క దాస్ గా పాపులారిటీ సంపాదించుకున్న విశ్వక్ సేన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి . ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో జనాలు మనకు తెలిసిందే. ఫుల్ టు ఫుల్ మాస్ యాక్షన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వక్సేన్ మాస్ రోల్ లో కనిపించాడు . నేహా శెట్టి – అంజలి హీరోయిన్లు గా నటించిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్లో రిలీజ్ అయింది .

కాగా ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన టాక్ వైరల్ గా మారింది. న్యూ డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఊ మూవీలోని డైలాగ్స్ ఇప్పుడు హైలైట్ గా మారాయి . ప్రతి ఒక్కరు డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు . అంతేకాదు ఈ డైలాగ్స్ పరోక్షంగా పొలిటీషియన్స్ కి ఘాటుగా తగిలే విధంగా ఉన్నాయి అంటున్నారు జనాలు. అంతేకాదు సినిమా కాన్సెప్ట్ బాగుందని ఫస్ట్ ఆఫ్ మొత్తం పుష్ప ఫాస్ట్ ట్రాక్ లా ఉంది అని.. సెకండ్ హాఫ్ వచ్చేసరికి డైరెక్టర్ బాగా ల్యాక్ చేశాడు అని .. సెకండ్ హాఫ్ కూడా బాగా రాసుకొని ఉంటే కధ వేరే లెవెల్ లో ఉండేది అని చెప్పుకొస్తున్నారు.

అంతేకాదు నేహా శెట్టి అంజలి క్యారెక్టర్లు సినిమాకి హైలైట్ గా మారాయి అని …మరొక నెటిజన్ చెప్పుకొచ్చాడు . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో విశ్వక్సేన్ వాడిన బోల్డ్ డైలాగ్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. డైరెక్టర్ ఏది చెప్తే అది బీప్ లేకుండా వాడేసాడు అంటూ నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు . మరి ముఖ్యంగా గామి సినిమాలో డిఫరెంట్ షేడ్స్ లో కనిపించిన విశ్వక్సేన్.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లో ఇంకా డిఫరెంట్ గా కనిపించారు అని ఊర నాటు మాస్ లుక్ లో అదరగొట్టేసాడు అని ..ఒక ముక్కలో చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్కి జూనియర్ ఈ విశ్వక్సేన అంటూ బాగా హైలెట్ చేస్తున్నారు . కొంతమంది సినిమాకి పాజిటివ్ రివ్యూ ఇస్తుంటే మరి కొంత మంది నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారు . చూద్దాం మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news