Moviesఫైనల్లీ మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలయ్య.....

ఫైనల్లీ మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలయ్య.. డైరెక్టర్ ఎవరంటే..?

నందమూరి అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేసిన అప్డేట్ ఇచ్చాడు బాలకృష్ణ. నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలకృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోగా రాణిస్తున్నారు. అంతేకాదు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఆయన కొడుకు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ కి సంబంధించిన ప్లాన్ జరుగుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే మోక్షజ్ఞ ఏ డైరెక్టర్ తో ఎంట్రీ ఇస్తున్నాడు అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు .

ఇదిగో ఎంట్రీ అదిగో ఎంట్రీ అంటున్నారు తప్పిస్తే ఎక్కడ అఫీషియల్ ప్రకటన అయితే లేదు . కాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన విదేశాలలో నటన శిక్షణలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది . ఈ నేపథ్యంలో తాజాగా కొడుకు మోక్షజ్ఞ హీరోగా పరిచయం చేయడానికి సంబంధించిన హింట్ ఇచ్చేశాడు బాలయ్య . ఓ ఈవెంట్లో పాల్గొన్న బాలయ్య ..మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇస్తున్నాడు అన్న విషయాన్ని తెలిపారు.

అంతేకాదు సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ విషయంలో తాత గారిని కాకుండా యంగ్ హీరోస్ అయినా విశ్వక్సేన్ – అడవిశేష్ – సిద్దు జొన్నలగడ్డ లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకోమని చెప్పాను అని చెప్పుకు వచ్చారు. ఇప్పటి తరం కుర్రాళ్ళు ఎలా రాణిస్తున్నారు అనేది చూసి నేర్చుకోవాలని చెప్పారు. అంతేకాదు కష్టపడి పైకి ఎదగాలి అని .. నటన కోసం ఏదైనా చేయాలి అని చెప్పుకొచ్చాడు . అయితే తాము బ్యాక్ బోన్ లా ఎప్పుడు ఉంటామని ..ఆ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని కూడా చెప్పారు . దీంతో మోక్షజ్ఞ ఎంట్రీ పై ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం బోయపాటి దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుంది అన్న వార్త ఎక్కువగా వినిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో..??

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news