తెలిసి మాట్లాడినా ..తెలియక మాట్లాడిన ..తప్పు తప్పే ..ఆ తప్పుని ఫ్యాన్స్ కూడా క్షమించరు. అది స్టార్ హీరో అయినా హీరోయిన్ అయినా .. ప్రెసెంట్ జాన్వి కపూర్ తెలిసి తెలియక మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . జాన్వి కపూర్ అందాల ముద్దుగుమ్మ.. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఈ అందాల ముద్దుగుమ్మ హిట్లు అందుకోలేకపోయింది .తెలుగులో దేవర ద్వారా డెబ్యూ ఇస్తుంది .
ఈ సినిమా కోసం బాగానే కష్టపడుతుంది . ఈ సినిమా కచ్చితంగా హిట్ ఇస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు . అయితే తాజాగా ఆమె నటించిన సినిమా మిస్టర్ అండ్ మిసెస్ మహి . ఈ సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటుంది జాన్వి కపూర్ . ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొనింది. తన కుటుంబ సభ్యుల విషయాల గురించి కూడా ఓపెన్ గా చెప్పుకు వచ్చింది . సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టమని .. అమ్మ చనిపోయిన తర్వాత శుక్రవారం బ్లాక్ డ్రెస్ వేసుకోవడం మానేశాను అని .. జాతకాలను ఎక్కువగా నమ్ముతాను అని చెప్పుకొచ్చింది .
అంతేకాదు మీడియాలో తన పెళ్లిపై వస్తున్న వార్తలుకు క్లారిటీ ఇచ్చింది . పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదు.. నాకెందుకు అప్పుడే సోషల్ మీడియాలో పెళ్లి చేసేస్తున్నారు.. నా కెరియర్ పైన మాత్రమే ఫోకస్ అంతా ఉంది అంటూ చెప్పుకొచ్చింది . పెళ్లంటే ఇంట్రెస్ట్ లేని దానివి శిఖర్ ప్రహరీయాతో ఎందుకు కారులో చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నావు ..? అంటూ ఏకేస్తున్నారు జనాలు . అంతేకాదు పబ్లిక్ గా గుడిలో కూడా ఆయనతో తిరుగుతున్నావ్.. ప్రేమ లేకుండానే ఇది చేస్తున్నావా ..? అంటూ పచ్చి బూతులతో ట్రోల్ చేస్తున్నారు..!!