Moviesప్రభాస్ అంటే చచ్చేంత ఇష్టం ఉన్నా సరే గోపీచంద్ ఎప్పటికీ ఆ...

ప్రభాస్ అంటే చచ్చేంత ఇష్టం ఉన్నా సరే గోపీచంద్ ఎప్పటికీ ఆ పని చేయడు .. ఎందుకో తెలుసా..?

మనకు తెలిసిందే.. సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ బెస్ట్ ఫ్రెండ్స్ గా కొనసాగుతూ ఉంటారు గోపీచంద్ – ప్రభాస్ . వీళ్ళ ఫ్రెండ్షిప్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఒకటి రెండు కాదు ఏళ్ల తరబడి వీళ్ళ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతూ వస్తుంది . మరీ ముఖ్యంగా ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ లో ఎదిగిన గోపీచంద్ ..ఇంకా ఒక సినిమా హిట్ కొట్టడానికి చూస్తూ ఉన్నాడు. గతంలో వీళ్ళ కాంబోలో వచ్చిన వర్షం సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకునిందో మనం చూసాం .

వీళ్ల కాంబోలో మరో సినిమా రావాలి అంటే చాలామంది ఆశపడ్డారు .. కానీ అది జరగలేదు.. నిజానికి వీళ్ళ కాంబోలో సినిమా రాడానికి చాలామంది డైరెక్టర్ ఇంట్రెస్ట్ చూపించారట . కానీ అది వర్క్ అవుట్ అవ్వలేదు . బాహుబలి సినిమాలో రానా దగ్గుబాటి పాత్రలో ముందుగా గోపీచంద్ ని విలన్ గా అనుకున్నారట. కానీ గోపీచంద్ మాత్రం రిజెక్ట్ చేశాడట . దానికి కారణం ఆయన హీరోగా సెటిల్ అవ్వాలి అనుకోవడమే.

అంతేకాదు చాలా సినిమాలలో ప్రభాస్ కి ఆపోజిట్ గా నెగిటివ్ క్యారెక్టర్ లో నటించాల్సిన క్యారెక్టర్స్ వచ్చినా కూడా ఆయన రిజెక్ట్ చేశారట . ఫ్యూచర్లో కూడా ప్రభాస్ సినిమాల్లో నెగిటివ్ క్యారెక్టర్ చేస్తాను అని అనుకోవడం లేదు అంటూ ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చిన మాటలను గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. అంతేకాదు ఆయన వేరే ఏ హీరో సినిమాలో కూడా నెగిటీవ్ షేడ్స్ పాత్రలో కనిపించడట..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news