సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫేక్ వార్తలు ఎక్కువగా వింటున్నాం. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన తప్పుడు వార్తలను ఎలా ఎక్కువగా జనాలు ప్రమోట్ చేస్తున్నారో కూడా మనం చూస్తున్నాం . తాజాగా హీరోయిన్ మెహ్రీన్ అలాంటి వార్తలపై మండిపడింది. తాను చేసింది ఒకటి అని ..బయట వార్తల్లో ప్రచారం చేస్తుంది మరొకటి అని మండి పడిపోయింది . దీంతో సోషల్ మీడియాలో మరొకసారి మెహ్రీన్ పేరు మారు మ్రోగిపోతుంది .
మనకు తెలిసిందే పంజాబీ బ్యూటీ అయినా సరే తెలుగులో చక్కగా నటించే అవకాశాలు అందుకుంటుంది . కృష్ణగాడి వీర ప్రేమ గాధ అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ అందాల ముద్దుగుమ్మ . ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి క్రేజీ క్రేజీ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది . ఆ తర్వాత మెహ్రీన్ పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయింది. ఆ తర్వాత ఆ పెళ్లిని నిశ్చితార్ధంతో నే బ్రేకప్ చెప్పేసుకుంది .
ఆ తర్వాత మళ్లీ సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో బిజీగా మారిన మెహ్రీన్..రీసెంట్ గా తన ఎగ్స్ ఫ్రీజ్ చేయించుకుంది . ఆ విధానం గురించి ఓపెన్ గా మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది . అయితే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దీన్ని వక్రీకరంగా రాసుకోచ్చింది. దీనిపై మెహిరిన్ సీరియస్ అయింది . “ఫ్రీజింగ్ ఎగ్స్ కోసం ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వాల్సిన అవసరం లేదు.. బాధ్యతాయుతమైన సెలబ్రిటీగా నా లక్ష్యం ఏంటంటే పిల్లలు కోల్పోయిన జంటలకు అవగాహన కోసమే ఆ పోస్ట్ పెట్టాను ..ఎవరైతే అమ్మాయిలు కెరియర్ పై దృష్టి పెట్టి ఆ తర్వాత పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలి అనుకుంటున్నారు వాళ్లకి ఇది బెస్ట్ ప్రాసెస్ అందుకే నేను ఈ విధంగా వాళ్ళకి అవగాహన కల్పించడానికి పోస్ట్ చేశాను.. అయితే కొంతమంది దీనిని తప్పుగా రాశారు.. నేను ప్రెగ్నెంట్ అంటూ నేను వేరే వాళ్ళ కారణంగా ప్రెగ్నెంట్ అయిపోయాను అంటూ పిచ్చిపిచ్చిగా రాతలు రాశారు . అస్సలు వదలను కచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటాను అని హెచ్చరించింది”. అంతేకాదు మెహరీన్ ఫాన్స్ కూడా దీనిపై మండిపడుతున్నారు . సిగ్గు లేదారా ..? ఒక ఆడపిల్ల పై ఇలాంటి తప్పుడు వార్తలు ఎలా రాస్తారు అంటూ మండిపడుతున్నారు . బహిరంగంగా ఆ వార్తలను డిలీట్ చేసి క్షమాపణలు చెప్పాలి అని మెహరీన్ అలాగే మెహ్రిన్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు..!!