ఈ మధ్యకాలంలో కపుల్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారో మనం చూస్తున్నాం పట్టుమంటూ కూర్చొని పది నిమిషాలు మాట్లాడుకోవడానికి కూడా టైం ఉండడం లేదు. ఆఫ్ కోర్స్.. పెరిగిపోతున్న సోషల్ మీడియా కల్చర్ కి కావచ్చు… మారిపోతున్న టెక్నాలజీకి కావచ్చు బిజీ బిజీగా లైఫ్ గడుపుతూ ఉండడం కావచ్చు . రీజన్స్ ఏవైనా సరే కనీసం భార్యాభర్తలు పక్కపక్కన కూర్చొని ఒక గంట కూడా టైం స్పెండ్ చేయలేని పరిస్థితి దాపురించింది. ఇద్దరు బిజీబిజీగా ఉద్యోగాలు చేసుకోవడం.. ఇంటికి రాగానే ఎవరి పనుల్లో వారు బిజీ అవ్వడం మళ్ళీ రేపు ఉదయం కోసం వర్క్‌లను స్టార్ట్ చేసుకోవడం ..ఇదే తంతూ చూస్తున్నాము..
అయితే చాలామందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు నాగార్జున – అమల జంట . పెళ్లి అయ్యి చాలా కాలమే అయింది . ఇప్పటికి కూడా వాళ్ళ మధ్య మిస్ అండర్ స్టాండింగ్స్ లేకుండా హ్యాపీగా తమ సంసార జీవితాన్ని ముందుకు తీసుకెళుతున్నారు.. అంటే కారణం మాత్రం వాళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ అంటున్నారు. అంతేకాదు వీళ్లు ప్రతి రోజు లేదా టైం కుదిరిన పక్షంలో ప్రతి వారంలో ఒక్కసారైనా సరే వీళ్లు టైం స్పెండ్ చేస్తారట .
మొబైల్స్ ను దూరంగా పెట్టేసి కచ్చితంగా వాళ్లలో పాజిటివిటీ నెగిటివిటీల గురించి చర్చించుకుంటారట . అసలు ఆ వీక్ ఏం జరిగింది? ఏంటి అని మనసు విప్పి ప్రశాంతంగా మాట్లాడుకొని.. ఫ్యామిలీతో సరదాగా లైఫ్ టైం స్పెండ్ చేస్తారు .. ఆ కారణంగానే వీళ్ళ దాంపత్య జీవితం ఎంత అన్యోన్యంగా ఉంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఎంతోమంది పెళ్లి చేసుకోని కేవలం ఆరు నెలల సంవత్సరానికి విడాకులు తీసుకుంటున్నారు . కానీ ఈ జంట మాత్రం ఇప్పటికే హ్యాపీగా ఉండడానికి మెయిన్ రీజన్ ఇదే అంటున్నారు అభిమానులు..!!