గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం . మరీ ముఖ్యంగా ఈ రేవ్ పార్టీలో వందమంది టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ హాజరయ్యారు అంటూ కన్నడ పోలీసులు విచారణలో బయటపడడం సంచలనంగా మారింది . అంతేకాదు టాలీవుడ్ ప్రముఖులు కూడా ఇదే పార్టీలోఎంజాయ్ చేసినట్లు కన్నడ పోలీసులు కనిపెట్టేశారు. అంతేనా ఏపీకి చెందిన వైసిపి పార్టీ నేత కూడా ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారు అంటూ వార్తలు వినిపించాయి .
ఆయన కారు ఈ రేవ్ పార్టీలో సీజ్ చేయడం అందరికీ హాట్ టాపిక్ గా అనిపిస్తుంది . అంతేకాదు ఆయనతో పాటు ఈ రేవ్ పార్టీలో తెలుగు టాప్ యాంకర్ కూడా పాల్గొంది అంటూ కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి . దీంతో ఆ యాంకర్ శ్యామలనే అంటూ పలువురు ఆమెపై దుష్ప్రచారం చేయడం ప్రారంభించారు . ఈ క్రమంలోనే కొందరు హద్దులు మీరిన కామెంట్స్ కూడా చేశారు . వైసీపీ క్యాడర్ కి సంబంధించిన ఒక ఆడపిల్ల పై ఇలాంటి విష ప్రచారం చేయడానికి తప్పు పడుతున్నారు జనాలు. శ్యామలపై కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనాలు .
తాజాగా ఈ విషయంపై శ్యామల కూడా స్పందించింది.” అసలు ఆ రేవు పార్టీ అంటే ఏంటి..? బెంగళూరులో ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది ..? ఎందుకు జరిగింది? అందులో ఎవరెవరు ఉన్నారు ..?నాకు అసలు ఏమీ తెలియదు ..ఎందుకు నన్ను అనవసరంగా ఈ విషయం లోకి లాగుతున్నారు ..దుష్ప్రచారం చేసిన నా పేరుని చెడగొడుతున్నారు . ఎంత దిగజారిన రాజకీయాలు చేస్తున్నారు అంటే ఒక పార్టీతో అనుసంధానం అయి ఉన్నాను అని తెలిసి ఈ విధంగా నాపై దుష్ప్రచారం చేయడం న్యాయమేనా..? దయచేసి ఇలాంటివి నమ్మకండి అంటూ శ్యామల రిక్వెస్ట్ చేసింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!!