Moviesఆనంద్ దేవరకొండ "గంగం గణేశా" మూవీ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే..?...

ఆనంద్ దేవరకొండ “గంగం గణేశా” మూవీ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే..? హిట్టా-ఫట్టా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తనదైన స్టైల్ లో దూసుకుపోతూ పలు సినిమాలో నటిస్తున్న ఆనంద్ దేవరకొండ రీసెంట్గా నటించిన సినిమా గం గం గణేశా . మనం గమనించినట్లయితే ఆనంద్ దేవరకొండ మొదటి నుంచి తనదైన స్టైల్ లో కొత్త కొత్త సినిమాల కాన్సెప్ట్ను రంగంలోకి దించుతూ ఉంటాడు. కాగా రీసెంట్గా ఆనంద్ దేవరకొండ నటించిన గంగం గణేశా థియేటర్లో రిలీజ్ అయింది .

ఈ సినిమా టాక్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దర్శకుడు ఉదయ్ బొమ్మెశెట్టి ఈ సినిమాలు తెరకెక్కించారు . మే 31న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకుంది . కధా కాన్సెప్ట్ అంతా పాతదే అయిన డైరెక్టర్ తనదైన చమత్కారంతో ముందుకు తీసుకెళ్లారు . అంతేకాదు ఆనంద్ దేవరకొండ పర్ఫామెన్స్ టూ హైలైట్ గా ఉంది అని రష్మిక మందన ప్రమోషన్స్ ఈ సినిమాకు ప్లస్ గా మారాయి అని ..క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అయిన నేపథ్యంలో జనాలు .

కచ్చితంగా ఈ సినిమాను చూసి ఎంటర్టైన్ అవుతారు అని చెప్పుకొస్తున్నారు ఆనంద్ దేవరకొండ. గత చిత్రాలకు ఈ చిత్రానికి భిన్నమైన కాన్సెప్ట్ చూస్ చేసుకున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండకు ప్రగతి శ్రీవాత్సవ్య జంటగా నటించింది . జబర్దస్త్ ఇమ్మానియేల్ – వెన్నెల కిషోర్- బిగ్ బాస్ ప్రిన్స్ యావర్ – సత్యం రాజేష్ సినిమాలో కీలక పాత్రలో మెప్పించారు . కచ్చితంగా జనాలు థియేటర్స్ కి వెళ్లి చూసి ఎంజాయ్ చేసే సినిమా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు . సినిమా ప్రారంభంలో కాన్సెప్ట్ అర్థం కాకపోయినా వెన్నెల కిషోర్ పర్ఫామెన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించిన టాక్ వైరల్ గా మారింది. చూద్దాం మరి ఫస్ట్ డే ఏ విధంగా కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news