శ్రీదేవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ..అతిలోకసుందరి .. ఆమె మన మధ్య లేకపోయినప్పటికీ ఆమెను హ్యూజ్ రేంజ్ లో అభిమానులు ఆరాధిస్తూ ఉంటారు . దానికి కారణం ఆమె నటన ..ఆమె టాలెంట్ ..అందమని చెప్పాలి. కాగా నటి శ్రీదేవి చాలా చిన్న ఏజ్ లోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. శ్రీదేవి తమ రిలేటివ్స్ పెళ్లి కోసం దుబాయ్ కి వెళ్లి అక్కడ ఒక బాత్ రూమ్ లో పడి మరణించింది . ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.
దీనిపై ఇప్పటికే శ్రీదేవి ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్న కూడా ఎవరు ఆన్సర్ చెప్పే వాళ్ళు లేకపోవడంతో ఆ మిస్టరీ అలాగే కొనసాగిపోతుంది. తాజాగా అరుదైన ఘనత అందుకుంది శ్రీదేవి . ముంబైలోని ఓ వీధికి ఆమె పేరుని పెట్టారు. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . లోఖండ్ వాలా కాంప్లెక్స్ లోని ఒక జంక్షన్ కి అక్కడి జనాలు శ్రీదేవి పై ఉన్న అభిమానంతో శ్రీదేవి కపూర్ చౌక్ గా నామకరణం చేశారు.
ఈ విషయాన్ని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తాజాగా ప్రకటించింది . గతంలో ఇదే ప్రాంతంలో గ్రీన్ ఎకర్స్ టవర్లో శ్రీదేవి కుటుంబం నివాసించడంతోనే స్థానికులు ఆమె పేరు పెట్టారు అంటూ తెలుస్తుంది . దీంతో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది. గతంలో అక్కడ శ్రీదేవి – బోనీకపూర్ తో పాటు జాన్వి కపూర్ – ఖుషి కపూర్ లు నివసించే వారు అని.. శ్రీదేవి మరణించిన అనంతరం అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యారు అని ..స్థానికులు చెబుతున్నారు . సోషల్ మీడియాలో ప్రజెంట్ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!