Moviesఅంత పద్ధతి అయిన పవిత్రమైన పేరు పెట్టుకుని .. "క్లీం కారా"ను...

అంత పద్ధతి అయిన పవిత్రమైన పేరు పెట్టుకుని .. “క్లీం కారా”ను మెగా ఫ్యామిలీ అలా పిలుస్తుందా..?

క్లీం కారా.. మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ – ఉపాసనల ముద్దుల కూతురు . పెళ్లి అయిన 11 ఏళ్లకు పుట్టిన అపురూపమైన బిడ్డ. మెగా ఫ్యామిలీలో క్లింకారా ఎంత స్పెషల్ అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్కరికి ఆమె బాగా నచ్చేస్తుంది . మెగా ఫ్యామిలీలో క్లిం కారను మోస్ట్ మోస్ట్ స్పెషల్ అని చెప్పాలి .

మెగా మనవరాలిగా సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండ్ అవుతున్న పేరు. ఉపాసన ఎంతో ఇష్టంగా ఆలోచించి మరి ఎంతో పవిత్రమైన లక్ష్మీ సహస్రనామాలలోని ఒక పేరుని క్లీం కార గా తన కూతురు కు పెట్టింది . అయితే ఏం లాభం అంత మంచి పేరు పెట్టినా కూడా మెగా ఫ్యామిలీ వాళ్ళు ముద్దుగా కింకారాలు.. కార్..కారా అంటూ పిలుచుకుంటూ ఉంటారట.

సాధారణంగా చాలామంది ఇంట్లో పిల్లలను ఇలాగే ముద్దు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. కానీ అలా పిలవడం అంత శ్రేయసకరం కాదు అంటూ పండితులు చెప్తున్నారు. నామకరణం చేసిన పేరుతోనే తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు పిలిస్తే ఆ బిడ్డలకు చాలా చాలా మంచి జరుగుతుంది అని చెప్పుకొస్తున్నారు. సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

కాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గానే గేమ్ చేంజెర్ సినిమా షూట్ ను కంప్లీట్ చేసుకున్నాడు . ప్రెసెంట్ టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు . ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా జరిగాయి. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతుంది . ఈ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా త్వరలోనే అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు చిత్ర మేకర్స్ . ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించబోతుంది..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news