బోయపాటి శ్రీను తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అభిమానులకి షాకింగ్ గా అనిపిస్తుంది . జనరల్ గా బోయపాటి శ్రీను అంటే మాస్ ఇమేజ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలనే చూస్ చేసుకుంటాడు . ఆయన మూవీస్ కూడా అదే విధంగా ఉంటాయి . అందుకే ఆయన మూవీస్ ఎక్కువగా ఫ్యాక్షన్ కి సంబంధించిన సినిమాలుగా తెరకెక్కుతాయి . అయితే ఫర్ ద ఫస్ట్ టైం బోయపాటి శ్రీను తన లిమిట్స్ ని బ్రేక్ చేసి రొమాంటిక్ లవ్ స్టోరీను తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారట .
అంతేకాదు ఈ కాన్సెప్ట్ కోసం యంగ్ హీరో నాగచైతన్యను చూస్ చేసుకున్నాడట. నాగచైతన్య కటౌట్ కి లవ్ స్టోరీ ఓకే .. కానీ ప్రెసెంట్ ఆయన ట్రాక్ రికార్డ్ ఎలా ఉందో తెలిసిందే. బోయపాటి ట్రాక్ రికార్డు కూడా ఎలా ఉందో మనకి తెలుసు. ఇద్దరు ఫ్లాప్ లు కలిస్తే ప్లస్ అయితే అంతా ఓకే ..మైనస్ అయితే మాత్రం జనాలకు మంచి కంటెంట్ దొరికినట్లు అవుతుంది.
మళ్లీ మీమర్స్ కిభారీ స్కోప్ ఇచ్చినట్లు అవుతుంది . దీంతో బోయపాటి శ్రీను ఫ్యాన్స్ పోయి పోయి ఆ హీరోకి ఛాన్స్ ఇచ్చావా..? అంటూ గుర్రుగా ఉన్నారు . చూడాలి మరి దీనిపై బోయపాటి ఎలా స్పందిస్తారో..? అంతేకాదు బోయపాటి శ్రీను టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తో కూడా ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి..!!