ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఇది మనం ఎక్కువగా వింటున్నాం. ఒక హీరో కోసం రాసుకున్న కథను మరొక హీరో చేసేస్తూ ఉండడం ..ఒక అప్పట్లో కూడా ఇలా జరిగేటివి కానీ సోషల్ మీడియా లేకపోవడంతో ఆ విషయాలు బయటకు వచ్చేటివి కాదు . డైరెక్టర్స్ కూడా ఆ విషయాలను పెద్దగా బయటకి చెప్పేవారు కాదు . కానీ ఇప్పుడు అలాంటి విషయాలను ఓపెన్ గా బయట పెట్టేస్తున్నారు.
మరి ముఖ్యంగా ఎవరైనా పెద్ద స్టార్ హీరో ఒక సినిమా రిజెక్ట్ చేసి .. ఆ సినిమాను మరొక చిన్న హీరో ఓకే చేసి హిట్టు కొడితే .. కావాలని సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఆ హీరో పేరుని బయట పెట్టేస్తున్నారు మేకర్స్ . అయితే ఇదే విషయంలో టాలీవుడ్ హీరోలు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది . ఇకపై సినిమాకి కమిట్ అయ్యేముందే ఏ హీరో అయినా సరే అగ్రిమెంట్ పై కొత్త కండిషన్ పెట్టాలి అంటూ డిసైడ్ అయ్యారట.
ఏ కారణం చేతనైనా సినిమా నుంచి తప్పుకుంటే ..తమ పేరు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదు అంటూ అగ్రిమెంట్లో కొత్త నోట్ ని ఇంక్లూడ్ చేయాలి అనుకుంటున్నారట . టాలీవుడ్ హీరోలు అందరూ కూడా ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉండడం గమనార్హం. ఇక మేకర్స్ కు చుక్కలు చూపించడం పక్కా అంటున్నారు జనాలు. ఒకందుకు ఈ నిర్ణయం మంచిదే ఎందుకంటే ..ఒక హీరో సినిమా మరొక హీరో చేసిన ఆ విషయం బయటకు రాదు ..ఫ్యాన్స్ కూడా హర్ట్ అవ్వరు. అంతేకాదు సోషల్ మీడియాలో స్టార్ హీరోస్ ట్రోలింగ్ ఎదుర్కోవడం కూడా తగ్గిపోవచ్చు . అందుకే హీరోలు ఈ నిర్ణయం తీసుకున్నారట..!