Moviesఅప్పుడు తాత ..ఇప్పుడు మనవడు ..హిట్ కోసం ఎన్ని తిప్పలు పడుతున్నారో..!

అప్పుడు తాత ..ఇప్పుడు మనవడు ..హిట్ కోసం ఎన్ని తిప్పలు పడుతున్నారో..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువగానే ఉంటుంది . స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ఎలా స్ట్రాంగ్ గా నిలబెట్టారో.. దానికి అంతగా సపోర్ట్ చేశాడు అక్కినేని నాగేశ్వరరావు గారు . ఇద్దరు కలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రను తిరగరాశారు అని చెప్పాలి. వీళ్ళిద్దరూ లేకపోతే అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ లేదు అని చెప్పడంలో సందేహం లేదు.

కాగా అప్పుడు హిట్స్ కోసం నాగేశ్వరరావు చేసిన పనిని ఇప్పుడు మనవడు నాగచైతన్య చేస్తూ ఉండడంతో అభిమానులు ఈ న్యూస్ను బాగా ట్రెండ్ చేస్తున్నారు . సినిమా ఇండస్ట్రీలో హీరోగా వచ్చాక ఎలాంటి హీరో అయినా సరే హిట్స్ కొట్టక తప్పదు. ప్లాప్స్ కూడా పడతాయి .. ఫ్లాప్స్ ని భరించి హిట్ కొట్టే ప్రయత్నంలో కొన్ని కొన్ని సార్లు చికాకులు తప్పవు . మనదైన స్ట్రాటజీలను ఫాలో అయితేనే ఇండస్ట్రీలో సెటిల్ అవ్వగలం . అయితే ఇప్పుడు హిట్ లు కోసం తన తాత స్ట్రాటజీలను ఫాలో అవుతున్నాడు మనవడు నాగచైతన్య .

నాగేశ్వరరావు గారు కూడా తనకు కలిసి వచ్చిన హీరోయిన్స్ తోనే పదేపదే ఎక్కువగా సినిమాలల్లో నటించేవారు . ఈ విషయం అందరికీ తెలిసిందే . ఇప్పుడు మనవడు నాగచైతన్య సైతం అదే రూట్ ను ఫాలో అవుతున్నాడు. తనకు కలిసి వచ్చిన హీరోయిన్స్ ని మళ్ళీ రిపీట్ చేస్తున్నారు . జనరల్ గా నాగచైతన్య తన సినిమాలలో హీరోయిన్స్ ని రిపీట్ చేయరు. ఫర్ ద ఫస్ట్ టైం ఆయన మళ్లీ తన సినిమాలలో హీరోయిన్స్ తో రిపీట్ చేస్తున్నారు. ఆయనకు కలిసి వచ్చిన లక్కీ హీరోయిన్ పూజ హెగ్డే తో పదేళ్ల తర్వాత రొమాన్స్ చేయబోతున్నాడు. సాయి పల్లవి తో కూడా ఆయన సెకండ్ సినిమాకు కమిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news