రవితేజ .. ఇప్పుడంటే ఈ పేరుకి పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు . కానీ ఒకప్పుడు ఈ పేరు చెప్తే వచ్చే అరుపులు కేకలు వామ్మో గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసేటివి. అప్పట్లో ఇడియట్ – అమ్మానాన్న తమిళ అమ్మాయి -భద్ర సినిమాలు ఎంతలా హిట్ అయ్యాయో మనకు తెలిసిందే . ప్రతి పాట ఇప్పటికీ మనం మొబైల్ లో ప్లే చేసుకుని వింటున్నామంటే ఆ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అర్థం చేసుకోవచ్చు . మరీ ముఖ్యంగా అప్పట్లో రవితేజ సినిమాలు హిట్ అవ్వడానికి ఇప్పుడు రవితేజ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కారణం ఏంటా అన్న క్వశ్చన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .
ఒకప్పటి సినిమాలల్లో రవితేజ చాలా నేచురల్ గా జోవియల్ గా కుర్రాళ్ళు ఇష్టపడే పాత్రల్లో కనిపించేవారు. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇడియట్ సినిమాలో రవితేజ నటించిన పాత్ర ప్రతి ఇంట్లోని కుర్రాడికి తండ్రికి కనెక్ట్ అవుతుంది. ఆ మాటలు ..ఆ చేష్టలు మన ఇళ్లల్లో కూడా మనం చూస్తూనే ఉంటాము. అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా విషయానికి వస్తే ఒక కొడుకు నుంచి తల్లి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది ..తల్లి కోసం కొడుకు ఏం చేస్తాడు అన్న కాన్సెప్ట్ను బాగా చూపించారు.
ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచిపోయింది. భద్ర సినిమా విషయానికొస్తే మల్టీ ఎమోషన్స్ అనే చెప్పాలి . ఒక లవర్ కోసం ఒక బాయ్ ఫ్రెండ్ పడే తపన ..ఫ్రెండ్షిప్ కోసం ఒక ఫ్రెండ్ చేసే సాక్రిఫైజ్ కుటుంబం కోసం ఇంటి కొడుకు చేసే త్యాగాలు ..అన్నీ కూడా బాగా చూపించారు . అయితే ఈ మధ్యకాలంలో రవితేజ ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకోవడం లేదు. ఆ కారణంగానే ఆయన నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అంటున్నారు అభిమానులు..!!