Movies"వర్షం" సినిమాపై రాజమౌళికి అలాంటి ఓపీనియన్ ఉందా..? ప్రభాస్ మాటలు వింటే...

“వర్షం” సినిమాపై రాజమౌళికి అలాంటి ఓపీనియన్ ఉందా..? ప్రభాస్ మాటలు వింటే మెంట్ ఎక్కిపోతాది..!

“వర్షం”.. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ కెరియర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమా టైంలో ప్రభాస్ ఎంత టెన్షన్ కి గురయ్యాడో. ఆయన గతంలో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు . అసలు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ లేని ప్రభాస్ వర్షం సినిమా విషయంలో చాలా చాలా టెన్షన్ పడ్డారట. అంతేకాదు ఈ సినిమా గురించి ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా చూసిన రాజమౌళి ప్రభాస్ కి ఇచ్చిన సజెషన్స్ గురించి ఆయన ఓపెన్ గా చెప్పుకొచ్చాడు.

“వర్షం సినిమా చూసిన తర్వాత రాజమౌళి నాతో ఒకటే అన్నారు .ఇదేం లవ్ స్టోరీ .. హీరో ఏమి పట్టనట్లు ఎప్పుడు హీరోయిన్ చుట్టూ తిరుగుతూనే ఉంటారా ..? నాకు లవ్ స్టోరీ లపై పెద్దగా ఐడియా లేదు .. ఇది ఒక స్టోరీ నా అంటూ సరదాగా కామెంట్ చేశారట .. రాజమౌళి మాట్లాడిన మాటలు ఇప్పటికే మర్చిపోలేకపోతున్నాను అంటూ స్వయానా ప్రభాస్ ఇంటర్వ్యూలో చెప్పుకు రావడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది”.

సాధారణంగా లవ్ స్టోరీ సినిమాలు అలానే ఉంటాయి . హీరో ఎక్కువగా హీరోయిన్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు . అయితే రీసెంట్గా ఈ వ్యాఖ్యలను మరోసారి ట్రెండ్ చేస్తున్నారు జనాలు . దీంతో ఇదే న్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ప్రజెంట్ ప్రభాస్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన కల్కి సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా తర్వాత స్పిరిట్ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు ప్రభాస్ . ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించబోతుందట..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news