Moviesప్రతి సినిమాకి జాన్వి కపూర్ అలాంటి కండిషన్ పెడుతుందా..? అప్పుడు తల్లి...

ప్రతి సినిమాకి జాన్వి కపూర్ అలాంటి కండిషన్ పెడుతుందా..? అప్పుడు తల్లి – ఇప్పుడు కూతురు ..మహాముదురులే..!

జాన్వి కపూర్.. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్న పేరు . చాలా చిన్న ఏజే ..పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాల్లో కూడా నటించలేదు. తోపైన హీరోయిన్ అని కూడా చెప్పలేం. అందంగా ఉంటుంది బాగా ఎక్స్ పోజ్ చేస్తుంది. శ్రీదేవి ముద్దుల కూతురు.. ప్రొడ్యూసర్ బోనీకపూర్ పెద్ద కుమార్తె.. ఇలా కొన్ని స్పెషల్ ట్యాగ్స్ కు సంబంధించి తప్పిస్తే పెద్దగా జాన్వి కపూర్ లో చెప్పుకో క్వాలిటీస్ లేవు.

అయినా సరే తెలుగులో బడా బడా హీరోల సినిమాలలో అవకాశాలు కొట్టేస్తుంది. దీనికి కారణం ఏంటా అంటూ చాలామంది బుర్ర పీక్కుంటున్నారు . ఫైనల్లి అదంతా శ్రీదేవి క్రేజ్ అని క్లారిటీ కి వచ్చారు . దేవర – ఆర్ సి 16 సినిమాలో హీరోయిన్లుగా ఫిక్స్ అయిన జాన్వి కపూర్ తాను కమిట్ అయ్యే ప్రతి సినిమాకి కూడా ఒకే ఒక కండిషన్ పెడుతుందట .

రెమ్యూనరేషన్ విషయం అస్సలు పట్టించుకోని జాన్వి కపూర్ తన సినిమాలలో క్యారెక్టర్రైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉండాలి అని.. ఎక్స్పోజింగ్ అయినా పర్వాలేదు కానీ తన పాత్రకు తగిన న్యాయం చేయగలిగే విధంగా ఉండే రోల్ రాయాలి అని ఏదో గ్లామరస్ పరంగా తెరపై కనిపించామా అన్న రోల్స్ మాత్రం తనకు ఇవ్వద్దు అంటూ ముందే చెప్పేస్తుందట . కథ చెప్పేటప్పుడు ఒకలాగా డైరెక్ట్ చేసేటప్పుడు మరొక లాగా చేయొద్దు అంటూ ముందుగానే క్లారిటీ ఇచ్చేస్తుందట. అందుకే హీరోయిన్ జాన్వి కపూర్ తన సినిమాల విషయంలో అంత స్ట్రిక్ట్ గా ఉంటుంది అన్న న్యూస్ వైరల్ గా మారింది..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news