ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో మలయాళీ బ్యూటీల హవా ఎక్కువగా కొనసాగుతుంది. నిన్న మొన్నటి వరకు కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అందాల ముద్దుగుమ్మలు చిట్టి పొట్టి బట్టలతో సెక్సీ ఫిగర్ తో హాట్ థైస్ తో టెంప్ట్ చేస్తే ఈ మలయాళీ ముద్దుగుమ్మలు మాత్రం నిండుగా చీర కట్టు కట్టుకొని ట్రెడిషనల్ లుక్స్ లోనే అభిమానులను ఆకట్టుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మలయాళీ బ్యూటీ మమిత బైజు పేరు ఎలా వైరల్ అయిందో మనం చూసాం.
ప్రేమలు అనే సినిమా ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకునేసింది . అంతేకాదు రాజమౌళి ప్రశంసలు దక్కించుకోవడంతో ఆమె పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రాజమౌళి ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ “మమితా బైజు నటనకు నేను ఫిదా అయిపోయాను అని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు”. అయితే కేవలం మమిత బైజూనే కాదు గతంలో ఇండస్ట్రీలో హీరోయిన్ గా వర్క్ చేసిన పలువురు మలయాళ బ్యూటీస్ సైతం ఇదే స్టైల్ లో ఎంకరేజ్ చేశారు తెలుగు జనాలు .
దానికి కారణం వల్ల కట్టుబొట్టు అంటూ తెలుస్తుంది. మీరాజాస్మిన్ ఎక్కడ వల్గారిటీ లేకుండా పద్ధతిగా చీర కట్టుకొని నటించింది. ఇప్పటికీ మీరాజాస్మిన్ అంటే జనాలు లైక్ చేస్తూ ఉంటారు. అనుపమ పరమేశ్వరన్ నిన్న మొన్నటి వరకు చాలా ట్రెడిషనల్ పాత్రలో కనిపించింది . ఈ మధ్యకాలంలోనే కుసింత హద్దులు మీరుతూ వచ్చేస్తుంది .
అనుపమ పరమేశ్వరన్ ఫాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. సాయి పల్లవి లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ చేయించుకుంది . తన చీరకట్టుతో తన పద్ధతి అయిన బిహేవియర్ తో తెలుగు జనాలను ఫిదా చేసేసింది. ఇలా ట్రెడిషనల్ లుక్స్ లో ఆకట్టుకోవడం కారణంగానే ఈ మలయాళీ బ్యూటీస్ ను తెలుగు జనాలు మర్చిపోలేకపోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..!!