సినిమా ఇండస్ట్రీ అంటేనే మాయా లోకం . ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. ఎవరి కెరియర్ ఎప్పుడు టాప్ కి వెళ్తుందో ..? ఎవరికి తెలియదు . ఎప్పుడు ఫట్ అంటూ పడిపోతుందో ఎవ్వరం చెప్పలేము. అయితే ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా కెరియర్ అటు టాప్ కి వెళ్లకుండా ఇటు ఫ్లాప్ అవ్వకుండా సమాంతరంగా తన కెరీర్ ని బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్ మాత్రం రాశిఖన్నా అనే చెప్పాలి . ఇండస్ట్రీలోకి ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటించింది . అయితే రాశిఖన్నా ఎన్ని సినిమాల్లో నటించిన సూపర్ డూపర్ హిట్ అనే రేంజ్ లో అవకాశాలు అందుకోకపోవడం ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం . మరి ముఖ్యంగా బాలీవుడ్ కోలీవుడ్ లో అయినా అరా కొరా బడా హీరోలతో నటించింది ఏమో కానీ తెలుగులో మాత్రం బడా హీరోలతో ఒక్కరితో కూడా స్క్రీన్ షేర్ చేసుకోలేక పోయింది . ఎన్టీఆర్ సరసన జై లవకుశ సినిమాలో మాత్రమే ఆమె పెద్ద హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంది.
రామ్ చరణ్ -బన్నీ- ప్రభాస్ – మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయింది . అయితే దానికి కారణం ఏంటో జనాలు ఎప్పటికప్పుడు చర్చించుకుంటూనే ఉంటారు . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం రాశిఖన్నా అందంగా ఉంటుందే కానీ ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఇవ్వలేదు అని.. నటన పరంగా ఆమె పర్ఫెక్ట్ హీరోయిన్ కాదు అని .. ఆ కారణంగానే తెలుగు స్టార్ హీరోలు ఆమెకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని ప్రచారం జరుగుతుంది.